వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ జోరు తగ్గింది: ఫ్యూచర్ జాబ్స్ ఈ రంగాల్లోనే.. వెల్లడించిన అసోచామ్

భవిష్యత్తులో లాజిస్టిక్స్‌, రవాణా, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అత్యధిక ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు అసోచామ్ తెలిపింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఒకప్పుడు జాబ్ అంటే ఐటీ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ రాను రాను ఐటీ జోరు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించిన ఐటీ.. ఇప్పుడు ఉన్న ఉద్యోగులనే తొలగించుకుంటున్న పరిస్థితి నెలకొంది.

2013నాటికి దాదాపు 33లక్షల మందికి ఉపాధి కల్పించిన ఐటీ.. గడిచిన మూడేళ్లలో 10లక్షల మందికి మాత్రమే ఉపాధిని అందించింది. 2022నాటికి సైతం 10లక్షల ఉద్యోగాలే సాధ్యమని అసోచామ్(అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా) తెలిపింది. థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థతో కలిసి అసోచామ్ ఈ సర్వే చేసింది.

 Construction, transport, retail may create most jobs: Assocham

భవిష్యత్తులో లాజిస్టిక్స్‌, రవాణా, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో అత్యధిక ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు అసోచామ్ తెలిపింది. ఐటీలో ఉద్యోగాల కల్పన ఆశించిన రీతిలో జరగకపోవడానికి క్నాలజీ అప్‌గ్రెడేషన్‌తో పాటు ఆటోమేషన్‌, వీసాల కష్టాలే కారణమని తెలుస్తోంది.

దేశంలో ఏటా కోటి నుంచి కోటిన్నర దాకా ఉద్యోగావకశాలు కల్పించాల్సి ఉండటంతో ఎగుమతులతో పాటు, దేశీయ మార్కెట్‌పైనా దృష్టి పెట్టాల్సి ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ రావత చెప్పారు. భవన నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో 2013 నాటికి 4.54 కోట్ల ఉద్యోగవకాశాలు ఏర్పడ్డాయని, రాబోయే రోజుల్లో ఈ రంగంలో మరో 3.11 కోట్ల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

దాంతో పాటు రిటైల్ రంగంలోను 1.2కోట్ల ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పింది. వస్త్ర పరిశ్రమలోను భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపింది.

English summary
Amid the controversy on jobless growth in India, industry chamber Assocham on Sunday cited its report holding that sectors like real estate, retail, wellness and transport and logistics may create most jobs in the near future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X