కంటైనర్ రూపంలో వచ్చిన మృత్యువు : మిని వ్యాన్‌ను ఢీ కొన్న కంటైనర్, 13 మంది మృతి
మల్కాపూర్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కాపూర్‌లో గల ఆరో నంబర్ జాతీయ రహదారిపై మినీ వ్యాన్‌ను భారీ కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 13 మంది చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉపాధి కోసం సొంతూరు నుంచి జలగౌవ్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఎదురుగా వచ్చిన మృత్యువు ..
మల్కాపూర్ జాతీయ రహదారిపై అతివేగంతో భారీ కంటైనర్ దూసుకొచ్చింది. అటుగా వస్తోన్న మినీ వ్యాన్‌ను ఒక్కసారిగా ఢీ కొట్టింది. అప్పటికే మంచి స్పీడులో ఉన్న కంటైనర్ .. మినీ వ్యాన్‌ను దాదాపు 50 మీటర్ల వరకు లాక్కెళ్లింది. అంటే ప్రమాద సమయంలో కంటైనర్ స్పీడ్ ఎంత ఉందో అర్థమవుతుంది. కంటైనర్ కింద చిక్కుకున్న వ్యాన్ నుజ్జునజ్జయ్యింది. ప్రమాదంలో 13 మంది చనిపోగా .. ముగ్గురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్ పూర్ జిల్లా నాగజిరికి చెందినవారీగా గుర్తించారు. పనికోసం సొంతూరు నుంచి జలగౌవ్ వెళ్తుండగా ప్రమాదం వారిని కబళించింది.












Click it and Unblock the Notifications