విద్యార్థినిపై అత్యాచారం, మొబైల్ లో చిత్రీకరించి, గర్భవతిని చేసి !
తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను బెదిరించి 8 నెలల నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర తాలుకా హ్యాక్కల్ లో జరిగింది.
బెంగళూరు: తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను బెదిరించి 8 నెలల నుంచి అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర తాలుకా హ్యాక్కల్ లో జరిగింది. బాలిక ఇప్పుడు మూడు నెలల గర్భవతి అని కల్లూరు పోలీసులు తెలిపారు.
హ్యాక్కల్ ప్రాంతంలో శ్రీధర్ నాయక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటి సమీపంలో దూరపు బంధవు అయిన 14 ఏళ్ల బాలిక నివాసం ఉంటూ తొమ్మిదో తరగతి విద్యాభ్యాసం చేస్తున్నది.
2016 మేనెలలో బాలిక ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో శ్రీధర్ నాయక్ అత్యాచారం చేశాడు. బాలిక మీద అత్యాచారం చేసి నగ్నంగా ఉన్న బాలికను మొబైల్ లో చిత్రీకరించాడు.

విషయం బయటకు చెబితే ఈ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో పెడుతానని బాలికను బెదిరించాడు. మొబైల్ లో ఉన్న ఫోటోలు అడ్డం పెట్టుకుని అప్పటి నుంచి బాలికను బ్లాక్ మెయిల్ చేసి 8 నెలల నుంచి అత్యాచారం చేస్తూ వచ్చాడు.
బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. బాలిక మూడు నెలల గర్భవతి అని వైద్యులు నిర్దారించారు. బాలిక కుటుంబ సభ్యులు శ్రీధర్ నాయక్ ను ప్రశ్నించగా తనకు ఏమీ తెలీదని మాయమాటలు చెప్నాడు.
బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలికను వైద్యపరిక్షలకు తరలించామని, శ్రీధర్ నాయక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications