Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైనెడ్ వేసి స్నేహితురాలి హత్య.... కిలాడి లేడి అరెస్టు

బెంగళూరు: నగదు, నగల కొసం మహిళలకు సైనేడ్ వేసి హత్య చేస్తున్న హంతకురాలిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని కేపీ అగ్రహారలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి అలియాస్ విజయా (50) అనే మహిళను అరెస్టు చేశామని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు.

సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెళ్లడించారు. తమిళనాడుకు చెందిన బిల్డింగ్ కాంట్రాక్టర్ సుబ్రమణి, మణిమేగలై దంపతులు గతంలో విజయలక్ష్మి ఇంటి ముందు నివాసం ఉండేవారు. ప్రస్తుతం మాగడి రోడ్డులో నివాసం ఉంటున్నారు.

మణిమగలైతో విజయలక్ష్మికి పరిచయం ఉంది. వీరిద్దరిది తమిళనాడు. ఈ విదంగా ఇాద్దరు స్నేహితులు అయ్యారు. టైలరింగ్ పని చేసుకునే విజయలక్ష్మి కుటుంబ నిర్వహణకు విపరీతంగా అప్పులు చేసింది. అప్పులు తీర్చడానికి చాల ఇబ్బందులు ఎదుర్కోనింది.

ఈ నెల 12వ తేదిన విజయలక్ష్మి, మణిమగలై ఒక బ్యాంకు దగ్గర కలిశారు. ఆ సమయంలో ఇద్దరు చాల సేపు మాట్లాడుకున్నారు. ఇంటికి రావాలని మణిమగలై చెప్పారు. మార్చి 13వ తేదిన విజయలక్ష్మి సైనెడ్ బాటిల్ తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని మణిమగలై ఇంటి దగ్గరకు బయలుదేరింది. తరువాత మార్గం మద్యలో ఫ్యాంట కూల్ డ్రింక్ బాటిల్ తీసుకునింది.

Contractor’s wife killed her friend with cyanide

నేరుగదా మణిమగలై ఇంటికి వెళ్లింది. వంట చేస్తున్న మణిమగలైకి సహాయం చేసినట్లు నటించింది. తరువాత బ్యాగ్ లోని కూల్ డ్రింక్ బాటిల్ తీసుకునింది. రెండు గ్లాస్ లలో కూల్ డ్రింక్ పోసింది. తరువాత నీళ్లు కావాలని చెప్పడంతో మణిమగలై లోపలికి వెళ్లారు. ఆసమయంలో ఒక గ్లాస్ లో సైనెడ్ వేసింది.

తరువాత వచ్చిన మణిమగలై కూల్ డ్రింక్ తాగి విలవిలలాడుతూ మంచం మీద పడి 5 నిమిషాలలో ప్రాణాలు విడిచింది. ప్రాణం పోయిందని నిర్దారించుకున్న విజయలక్ష్మి బీరువాలో ఉన్న రూ. 7.50 లక్షలు, 200 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి వస్తువులు, మిగిలిన అర్ధం బాటిల్ ఫ్యాంట తీసుకునింది.

కేసు దర్యాప్తు పక్కదోవ పట్టించడానికి విజయలక్ష్మి ప్లాన్ వేసింది. దేవుడి గదిలో ఉన్న దీపం తీసుకుని వెలిగించి మణిమగలై పడుకుని ఉన్న మంచం, బెడ్ కు నిప్పంటించి అక్కడి నుండి పరారైయ్యింది. మద్యాహ్నం మనిమగలై కుమారుడు ఇలంగోవన్ కాలేజ్ నుండి ఇంటికి రావడంతో హత్య జరిగిన విషయం వెలుగు చూసింది.

వీరి ఇంటికి విజయలక్ష్మి వచ్చి వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు గాలించి తమిళనాడులో తలదాచుకున్న నిందుతురాలిని అరెస్టు చేశారు. హంతకురాలి నుండి నగదు, నగలు, వెండి వస్తువుల స్వాదీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+