మంత్రి మీద ఎఫ్ఐఆర్, సార్ ఏం మాట్లాడారంటే ?, మైనార్టీలను వెంటాడి ?
బెంగళూరు: బెంగళూరు సిటీలోని రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత, ప్రవాసాంధ్రుడు మునిరత్న ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా పని చేస్తున్నారు. మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న మునిరత్న ఇటు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, సినిమా రంగంలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో ఎమ్మెల్యేగా గెలిచిన మునిరత్న ఆపరేషన్ కమలలో భాగంగా బీజేపీలో చేరి మంత్రి అయ్యారు.
ఇటీవల బెంగళూరులోని జాలహళ్లిలోని ఖతానాగర్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మునిరత్న మాట్లాడారు. ఆ సందర్బంలో ఖాతానగర్ వార్డులోకి ఎవరైనా వచ్చి ఓట్లు అడిగితే తరిమితరిమి కొట్టండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయులను, క్రైస్తవులను ఉద్దేశించి మంత్రి మునిరత్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అదే నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ లీడర్ కుసుమా హనుమంతప్ప ఆరోపించారు.
మంత్రి మునిరత్న ఆర్ఆర్ నగరలో కన్నడిగులు-తమిళ ప్రజల మధ్య, హిందూ- క్రైస్తవుల మధ్య చిచ్చు రేపుతున్నారని, ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుసుమా హనుమంతప్ప బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రి మునిరత్న ప్రజలను రెచ్చగొడుతున్న సమయంలో తీసిన వీడియో కూడా కుసుమా పోలీసులకు అందించారు.

మంత్రి మునిరత్న మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల కమీషన్ అధికారులు విచారణ జరిపారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి ఇరు వర్గాల ప్రజల మధ్య గొడవలు జరిగేలా మంత్రి మునిరత్న బహిరంగంగా మాట్లాడారని విచారణలో వెలుగు చూసింది.
కర్ణాటక మంత్రి మునిరత్న మీద బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మైనార్టీలను తరిమితరిమి కొట్టండి అంటూ మరో వర్గం వారిని మంత్రి మునిరత్న రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కర్ణాటక మంత్రి మునిరత్న మీద ఆర్ఆర్ నగర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications