Bomb blast: ప్లాన్ కు ముందే కేరళలో మీటింగ్, కోయంబత్తూరుతో లింక్, డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ తో లింక్ ?

బెంగళూరు/కొచ్చి/ కోయంబత్తూరు: మంగళూరు కుక్కర్ బాంబు కేసు మరో మలుపుతిరిగింది. మంగళూరులో కుక్కర్ బాంబుతో ఏదో చెయ్యాలని అనుకున్న అనుమానిత ఉగ్రవాది షారిఖ్ స్కెచ్ రివర్స్ కావడం, మధ్యలో ఆటోలోనే కుక్కర్ బాంబు పేలిపోవడంతో ఉగ్రవాదుల స్కెచ్ రివర్స్ అయ్యింది. ఎన్ఐఏ అధికారుల ఎంట్రీతో కేసు దర్యాప్తు మంగళూరు నుంచి కేరళ వరకు వెళ్లింది. కేరళలోని రహస్య ప్రాంతంలో మంగళూరు బాంబు పేలుడు నిందితుడు షారిఖ్ తో పాటు కోయంబత్తూరు బాంబు పేలుడు నిందితుడు ముబిన్ తదితరులు కేరళలో భేటీ అయ్యారని వెలుగు చూసింది. కోయంబత్తూరు కారు బాంబు పేలుడుతో మబిన్ ప్రాణం పోయింది. కేరళలో వీరిద్దరితో పాటు ఇంకా ఎంత మంది కలిశారు ?, వాళ్ల స్కెచ్ ఏమిటి ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ దందా, గోల్డ్ స్మగ్లింగ్ చేసుకున్న ఓకే మతానికి చెందిన వారు వీళ్లకు సహకరిస్తున్నారని వెలుగు చూడటంతో కథ మరో మలుపు తిరుగుతోంది.

మంగళూరుకు ముందే కేరళలో మీటింగ్

మంగళూరుకు ముందే కేరళలో మీటింగ్

మంగళూరు కుక్కర్ బాంబు కేసు మరో మలుపుతిరిగింది. మంగళూరులో కుక్కర్ బాంబుతో ఏదో చెయ్యాలని అనుకున్న అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ స్కెచ్ రివర్స్ కావడం, మధ్యలో ఆటోలోనే కుక్కర్ బాంబు పేలిపోవడంతో ఉగ్రవాదుల స్కెచ్ రివర్స్ అయ్యింది. మంగళూరు బాంబు పేలుడుకు ముందే షారిఖ్ చాలా రోజులు కేరళలో ఉన్నాడని వెలుగు చూసింది.

కేరళలో ఇక్కడే భేటీ ?

కేరళలో ఇక్కడే భేటీ ?

మంగళూరు బాంబు పేలుడు నిందితుడు షారిఖ్ కొంతకాలం క్రితం మైసూరు నుంచి కేరళలోని అలువా సమీపంలోని రహస్య ప్రాంతానికి వెళ్లాడని వెలుగు చూసింది. మంగళూరు బాంబు పేలుడు నిందితుడు షారిఖ్ తో పాటు కోయంబత్తూరు బాంబు పేలుడు నిందితుడు ముబిన్ తో పాటు కొంత మంది కేరళలో అలువా సమీపంలోని రహస్య ప్రాంతంలో భేటీ అయ్యారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు ?

మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు ?

ఇప్పటికే కోయంబత్తూరులో శివుడి గుడి సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో నిందితుడు ముబిన్ ప్రాణం పోయింది. ముబిన్ తో పాటు ఇప్పుడు మంగళూరు కుక్కర్ బాంబు పేలుడులో గాయపడిన షారిఖ్ తదితరులు కేరళలో భేటీ అయ్యారని వెలుగు చూసింది. డ్రగ్స్ దందా, గోల్డ్ స్మగ్లింగ్ చేసుకున్న ముస్లీం మతానికి చెందిన కొందరు వ్యక్తులు వీళ్లకు సహకరిస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అలువాలో ఏం జరిగింది ?

అలువాలో ఏం జరిగింది ?

కోయంబత్తూరు కారు బాంబు పేలుడు, మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు జరగడానికి కొన్ని నెలల ముందే కేరళలోని అలువా సమీపంలోని రహస్య ప్రాంతంలో కొంత మంది సమావేశమై దేశంలో విధ్వంసాలు సృష్టించాలని స్కెచ్ వేశారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

కేరళలో ప్లాన్ వేశారని ?

కేరళలో ప్లాన్ వేశారని ?

మంగళూరు కుక్కర్ బాంబు పేలుడులో గాయపడిన అనుమానిత ఉగ్రవాది షారిఖ్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ఆసుపత్రిలో ఉండటంతో ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి వేచి చూస్తున్నారు. మొత్తం మీద కోయంబత్తూరు కారు బాంబు కేసు, మంగళూరు కుక్కర్ బాంబు కేసుకు కేరళతో లింక్ ఉందని వెలుగు చూడటంతో అధికారులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+