Cooker bomb: టార్గెట్ ఆలయాలు, శివుడి గుడిలో షారిఖ్ కు ఏం పని ?, సీసీటీవీ కెమెరాల్లో ?, ప్లాన్ B !
మంగళూరు/బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో కుక్కర్ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మంగళూరులో అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ బాంబు పేలుడుకు పెద్ద స్కెచ్ వేశాడని. చివరి నిమిషాల్లో రివర్స్ అయ్యిందని అధికారులు అంటున్నారు. అయితే షారిఖ్ హిందూ దేవాలయాలను, ముఖ్యంగా ప్రముఖ కద్రి దేవాలయాలను టార్గెట్ చేసుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ముస్లీం అయిన షారిఖ్ శివుడి గుడి దగ్గర సంచరిస్తున్న సీసీటీవీ పుటేజీలు పోలీసుల చేతికిచిక్కడంతో కథ మలుపుతిరిగింది.

కుక్కర్ బాంబు కథలో ?
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో నివాసం ఉంటున్న మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరు సిటీలోని గెరోడియ ప్రాంతంలో ఆటోలో షారిఖ్ కుక్కర్ బాంబు తీసుకు వెలుతున్న సమయంలో మార్గం మద్యలోనే ఒక్కసారిగా పేలిపోయింది.

టార్గెట్ ఏమిటి ?
షారిఖ్ కుక్కర్ బాంబును వేరే ప్రాంతంలో పేల్చడానికి ప్రయత్నించి ఉంటాడని పోలీసు అధికారులు పసిగట్టారు. ఆటోలో జరిగిన కుక్కర్ బాంబు పేలుడులో అనుమానిత ఉగ్రవాది షారిఖ్ తో పాటు ఆటో డ్రైవర్ పురుషోత్తమ్ పూజారికి తీవ్రగాయాలైనాయి. షారిఖ్ మంగళూరులోని ఏ ప్రాంతానికి వెళ్లాలని ప్రయత్నించాడు. అతని టార్గెట్ ఏమిటి అని పోలీసు అధికారులు ఆరా తీశారు.

కేసు పెట్టిన మేడమ్
మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు కేసు ఊహించని మలుపు తిరిగింది. మంగళూరులోని కద్రి దేవాలయాన్ని టార్గెట్ చేసుకున్నారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో కద్రి మంజునాథేశ్వర దేవాలయం ఈవో జయమ్మ మంగళూరు సిటీ పోలీసుకు ఫిర్యాదు చేసి దేవాలయానికి భద్రత కల్పించాలని మనవి చేశారు.

శివుడి గుడిలో ముస్లీంకు ఏం పని ?, ఆరా తీస్తున్న అధికారులు
ఇదే సమయంలో కద్రి మంజునాథేశ్వర ఆలయానికి కొందరు బాంబు బెదిరింపులు చేశారు, ప్రతిరోజు కద్రి మంజునాథేశ్వర దేవాలయానికి వేల సంఖ్యలో శివుడి భరక్తువు వచ్చి వెలుతుంటారు. కద్రి మంజునాథేశ్వర ఆలయాం ఈవో జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ముస్లీం అయిన షారిఖ్ శివుడి గుడి దగ్గర సంచరిస్తున్న సీసీటీవీ పుటేజీలు పోలీసుల చేతికిచిక్కడంతో కథ మలుపుతిరిగింది.












Click it and Unblock the Notifications