గొంతులోతు వరదనీరు.. టబ్‌లో పసిపాపను పడుకోబెట్టి ప్రాణాలు కాపాడిన పోలీసు..
వడోదర : పోలీసులంటే చాలా మందికి హడల్. కొందరు ఖాళీలు ప్రవర్తించే తీరు అందుకు కారణం. కానీ గుజరాత్‌లో మాత్రం ఓ పోలీసు మానవత్వాన్ని చాటుకున్నాడు. వరదలో చిక్కుకున్న బిడ్డను తలపై మోస్తూ గొంతులోతు నీళ్లలో నడిచి ప్రాణాలు కాపాడాడు. అతను చేసిన సాహసానికి ప్రతి ఒక్కరూ సలాం కొడుతున్నారు.

జలమయమైన లోతట్టు ప్రాంతాలు
గుజరాత్‌లోని వడోదరను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులువంకలు పొంగిపొర్లు తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఐదడుగుల మేర నీరు చేరడంతో అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. విశ్వామిత్రి రేల్వే స్టేషన్ సమీపంలోని దేవిపురాలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. భారీగా వరద నీరు చేరడంతో అక్కడి జనం బయటకు వేళ్లే దారిలేకుండా పోయింది. దాదాపు ఐదు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.

వరద నీటిలో చిక్కుకున్న పసిబిడ్డ
దేవీపురాలో నెలకొన్న పరిస్థితి గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాడును ఒకవైపు నుంచి మరోవైపునకు కట్టి జనాన్ని పట్టుకుని వరద నీటిని దాటించారు. ఇంతలో ఓ ఇంట్లో ఓ మహిళ బిక్కుబిక్కుమంటూ ఉన్న దృశ్యం ఎస్ఐ గోవింద్ చావ్డా కంటపడింది. ఆమె వద్దకు వెళ్లిన ఎస్ఐ ఎందుకు బయటకురావడంలేదని ప్రశ్నించగా.. అక్కడ పడుకుని ఉన్న పసిపాపను చూపించింది. దాదాపు ఏడాదిన్నర వయసున్న చిన్నారిని వరద నీటి నుంచి ఎలా దాటించాలో తెలియక ఆ తల్లి ఆందోళన చెందుతోంది. దీంతో వెంటనే గోవింద్‌కు ఓ ఉపాయం తట్టింది.

బిడ్డను తలపై ఎత్తుకుని పీకల్లోతు నీళ్లలో నడుస్తూ
సదరు మహిళను అడిగి ఓ ప్లాస్టిక్ టబ్ తీసుకున్న ఎస్ఐ గోవింద్ అందులో కొన్ని బట్టలతో పాటు బెడ్ షీట్‌ను పరిచాడు. అందులో పాపను పడుకోబెట్టి దాన్ని తలపై పెట్టుకున్నారు. తాడు సాయంతో పీకల్లోతు నీళ్లలో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరం వరకు జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ తల్లీ బిడ్డల్ని సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. బిడ్డను తల్లికి అప్పగించాడు. తనతో పాటు బిడ్డను సహాయకశిబిరానికి చేర్చిన గోవింద్ చావ్డాకు సదరు మహిళ కృతజ్ఞతలు చెప్పింది. గొంతు వరకు నీళ్లలో మునిగి పసిపాపను రక్షించిన ఎస్ఐను పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications