గ్యాంగస్టర్ గాలితో భేటీ?: నటుడు అర్జున్ రాంపాల్‌కు నోటీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు ముంబైలోని జెజె మార్గ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెలలో జెజె ఆస్పత్రిలో జైలులో ఖైదీగా ఉన్న గ్యాంగస్టర్ అరుణ్ గాలిని కలిశాడనే సమాచారం అందడంతో ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారు. దడ్డీ సినిమాలో అర్జున్ రాంపాల్ అరుణ్ గాలి పాత్రను పోషిస్తున్నాడు.
నిరుడు డిసెంబర్ 29వ తేదీన ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ డిపార్టుమెంటులో గాలితో అర్జున్ రాంపాల్ దాదాపు గంట పాటు గడిపారు. రాంపాల్ ఈ భేటీకి ఏ విధమైన అనుమతీ తీసుకోలేదు. 2008లో జరిగిన కార్పోరేటర్ కమ్లాకర్ జంషాండేకర్ హత్య కేసులో అరుణ్ గాలి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.

ప్రస్తుతం అర్జున్ రాంపాల్ రాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఉన్నాడు. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషింగా, రణబీర్ కపూర్ ప్రత్యేక పాత్ర పోషించాడు. దడ్డీ సినిమా షూటింగ్ మూడు రోజుల పాటు జరిగింది. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గాలిని జెజె ఆస్పత్రికి తీసుకుని వచ్చినప్పుడు రాంపాల్ అతన్ని కలిశారు.
కోర్టు అనుమతి లేకపోవడంతో గాలితో భేటీ రాంపాల్‌కు కష్టాలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. తాలోజా జైలు నుంచి ఆస్పత్రికి గాలిని తీసుకుని వచ్చిన పోలీసులపై అంతర్గత విచారణ కూడా జరుగుతోంది. అర్జున్ రాంపాల్‌కు స్థానిక పోలీసులు నోటీసు జారీ చేసిన విషయాన్ని శాంతిభద్రతల జాయింట్ పోలీసు కమిషనర్ ధనంజయ్ కమ్లాకర్ ధ్రువీకరించారు. గాలితో భేటీపై రాంపాల్‌ను పోలీసులు ప్రశ్నిస్తారని ఆయన చెప్పారు.దడ్డీ సినిమాకు గౌరవ్ బవ్‌దాంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది బాలీవుడ్‌లో తొలి సినిమా.












Click it and Unblock the Notifications