వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షకు చేరువగా కరోనా యాక్టివ్ కేసులు.. మరో రెండు వ్యాక్సిన్ల అత్యవసరవినియోగానికి డీసీజీఐ అనుమతి

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసుల మధ్య ఊగిసలాట కొనసాగుతుంది. ఏది ఏమైనా దేశంలో 10వేలకు మించిన కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 14,506 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 30 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా తెలిపింది.

దేశంలో లక్షకు చేరువగా కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో లక్షకు చేరువగా కరోనా యాక్టివ్ కేసులు


గత 24 గంటల్లో 11,574 మంది రోగులు కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో మొత్తం 99,602 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య లక్షకు చేరువ కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మంగళవారం 3,482 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 47శాతం కరోనా కేసుల పెరుగుదల కనిపించింది. అలాగే, మహారాష్ట్రలో వరుసగా మూడో రోజు కూడా ఐదు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

ముంబైలో భారీగా నమోదవుతున్న కేసులు

ముంబైలో భారీగా నమోదవుతున్న కేసులు

మొత్తం కేసుల్లో ముంబైలో 1,290 కేసులు నమోదయ్యాయి. టెస్ట్ పాజిటివిటీ రేటు ముంబై నగరంలో 11.70 శాతంగా ఉంది. మరోవైపు, ఢిల్లీలో గత 24 గంటల్లో 874 తాజా కోవిడ్-19 కేసులతో పాటు 4మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 4,482 వద్ద ఉండగా, సానుకూలత రేటు 5.18% వద్ద ఉంది. రాజధానిలో 941 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నారు. ఇక మరోవైపు కేరళలోనూ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.

కోవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

కోవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి


పూణేలోని జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌లో అభివృద్ధి చేయబడిన దేశంలోని మొట్టమొదటి స్వదేశీ mRNA కోవిడ్-19 వ్యాక్సిన్ 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) మంగళవారం రెండు-డోస్ mRNA వ్యాక్సిన్‌ను ఆమోదించింది. డ్రగ్ రెగ్యులేటర్ కొన్ని షరతులకు లోబడి 7 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం కోసం సీరం ఇన్స్టిట్యూట్ యొక్క COVID-19 వ్యాక్సిన్ కోవోవాక్స్‌ను కూడా ఆమోదించింది.

అప్రమత్తంగా ఉండండి ... రాష్ట్రాలకు కేంద్రం పిలుపు

అప్రమత్తంగా ఉండండి ... రాష్ట్రాలకు కేంద్రం పిలుపు

ఇదిలా ఉండగా, రాష్ట్రాలు కోవిడ్ -19 వ్యాప్తిని నిరోధించేలా చూసుకోవడానికి రాబోయే నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని, సామూహిక సభలు, యాత్రల విషయంలో అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలను కోరారు. అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
The current situation of corona active cases approaching one lakh is worrying. Recently 14,506 new cases of corona were reported. The DCGI approved the emergency use of two other vaccines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X