దేశంలో 1000 దాటిన కరోనా కేసులు..మరోసారి లాక్‌డౌన్..?
కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిందని భావించిన కోవిడ్-19 కేసులు, ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా సమాచారం (మే 26, 2025 నాటికి) ప్రకారం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటి 1011కు చేరుకోవడం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. దీనికి తోడు, నిరంతరం పెరుగుతున్న కేసుల సంఖ్య, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

కేరళ: అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర: 212 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ: 104 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
గుజరాత్: 88 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
తమిళనాడు: 79 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
కర్ణాటక: 49 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఇతర రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ (15), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (12), పుదుచ్చేరి (9), హర్యానా (9), ఆంధ్రప్రదేశ్ (4), మధ్యప్రదేశ్ (2), ఛత్తీస్‌గఢ్ (1), గోవా (1), తెలంగాణ (1) లలో కూడా కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ మరణాల సంఖ్య కూడా దేశంలో 5కి చేరిందని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజల్లో మరింత భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా రోగుల కోసం ఆస్పత్రులలో ప్రత్యేకమైన బెడ్‌లను సిద్ధంగా ఉంచాలని కేంద్రం సూచించింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications