వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశానికి కరోనా విపత్తు : మహారాష్ట్ర , ఢిల్లీ, ఏపీ ,తెలంగాణాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఇలా !!

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొనసాగుతూనే ఉంది. అనేక రాష్ట్రాలు మహమ్మారి దెబ్బకు అతలాకుతలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా కేసుల పెరుగుదల , మౌలిక వసతుల కొరత నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కరోనా కట్టడికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఇక వివిధ రాష్ట్రాల్లో తాజా కరోనా పరిస్థితిని చూస్తే

శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం .. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భక్తులకు నో ఎంట్రీ శ్రీరామనవమి వేడుకలపై కరోనా ప్రభావం .. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి భక్తులకు నో ఎంట్రీ

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

.. సంపూర్ణ లాక్ డౌన్

మహారాష్ట్ర కరోనా కారణంగా దారుణంగా ప్రభావితమైన రాష్ట్రంగా ఉంది. మంగళవారం 62,097 తాజా కరోనావైరస్ కేసులను నివేదించింది, దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 39.6 లక్షలకు పైగా చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజులో 519 మంది రోగులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్ లాంటి ఆంక్షలతో పాటు మరిన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని మహారాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసిన నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి సంపూర్ణ లాక్ డౌన్ పై ప్రకటన చేయనున్నారు.

Corona disaster in India: Maharashtra, Delhi,as well as the latest situation in various states

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 28,395 కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ నుండి విజ్ఞప్తి చేసిన తరువాత, ఆక్సిజన్ నిల్వలను పంపింది కేంద్రం . ఢిల్లీ లోని ముఖ్యమైన మూడు ప్రధాన ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.

అయినప్పటికీ దేశ రాజధాని తీవ్ర ఆక్సిజన్ కొరతతో ఉంది . ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంపై దృష్టి సారించారు .

కేరళలో నైట్ కర్ఫ్యూ విధింపు

కేరళలో అమలవుతున్న నైట్ కర్ఫ్యూ

కోవిడ్ -19 కేసులలో కేరళ మంగళవారం అత్యధికంగా 19,577 కేసులను నమోదు చేసింది. ఇది రాష్ట్ర మొత్తం సంఖ్య ను 12.72 లక్షలకు పైగా పెంచింది . ఒకే రోజు 28 మంది రోగుల మరణాలు సంభవించాయి. విపరీతంగా పెరుగుతున్న కేసులతో కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎర్నాకులం జిల్లాలోని పలు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ విధించి కరోనా కట్టడికి ప్రయత్నిస్తోంది కేరళ సర్కార్.

కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ మరియు వారాంతపు లాక్ డౌన్

కర్ణాటకలో కరోనా కట్టడి కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది బిఎస్ యడ్యూరప్ప ప్రభుత్వం. రాష్ట్రం చూస్తున్న భారీ కోవిడ్ స్పైక్‌ను నియంత్రించే ప్రయత్నాలకు కఠినమైన చర్యలను ప్రకటించింది. వీటిలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి మరియు వారాంతపు కర్ఫ్యూ విధించింది. అలాగే సభలను, సమావేశాలను నిర్వహించకుండా నిషేధం విధించింది. విద్యా మరియు అనేక వాణిజ్య సంస్థలను మూసివేయడం వంటి చర్యలు చేపడుతోంది . కర్ణాటక రాష్ట్రంలో 21,794 కొత్త కేసులతో ఒకే రోజు అత్యధికంగా నమోదయ్యాయి, వాటిలో 13,782 బెంగళూరుకు చెందినవి.

ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్న వారాంతపు లాక్ డౌన్

ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు గత 24 గంటల్లో 30,000 కొత్త కేసులు నమోదయ్యాయి . 20 కోట్లకు పైగా జనాభాతో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్, గత ఏడాది సెప్టెంబరులో కరోనా వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు మొదటి దశలో కోవిడ్ సంక్షోభం నుండి బయటపడగలిగింది .రాష్ట్రం రెండవ తరంగంతో తీవ్రంగా దెబ్బతింది. అధిక సంఖ్యలో క్రియాశీల కేసులు పెరగడంతో ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ మరియు మెడిసిన్స్ కోసం తీవ్ర ఇబ్బంది నెలకొంది. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాలపై కరోనా ప్రభావం తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వారాంతపు లాక్ డౌన్ ను విధించింది .


తెలంగాణలో నైట్ కర్ఫ్యూ , ఏపీలో కట్టడికి చర్యలు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఇప్పటికే నైట్ కర్ఫ్యూను ప్రకటించి కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తుంటే, ఏపీ సర్కార్ కరోనా నియంత్రణ కోసం జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల లేమి కనిపిస్తుంది . అధికారికంగా నమోదవుతున్న కేసులు కంటే అనధికారికంగా కేసులు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరణాలు కూడా విపరీతంగా పెరిగినట్లుగా సమాచారం.

రాజస్థాన్లో ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు 144 సెక్షన్

రాజస్థాన్‌లో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా, ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ విధించాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. కార్యాలయాలు మరియు మార్కెట్లను మూసివేయాలని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా విపరీతంగా పెరుగుతున్న కేసులతో రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత నెలకొంది. ఆస్పత్రిలో బెడ్ లు , ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది.

English summary
Corona is creating tension in India. The latest situation in the corona epidemic in different states is as follows. The Maharashtra government has decided towards a complete lockdown in Maharashtra. There is a severe shortage of oxygen in Delhi. The night curfew will continue in Telangana. Section 144 will come into force in Rajasthan from tomorrow. Imposed a weekend lock-down in UP. Kerala night curfew enforced. Weekend lockdown and night curfew are being enforced in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X