• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ .. ఖాళీగా ప్రైవేట్ ఆస్పత్రులు ... కిటకిటలాడుతున్న సర్కారీ ఆస్పత్రులు

|

కరోనా వైరస్ వైద్యో నారాయణో హరి అన్న పదానికి అర్థాన్ని అర్థమయ్యేలా చెప్పింది. నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందక ముందు కిట కిట లాడిన ప్రైవేట్ ఆస్పత్రులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి . ఏదో చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా అడ్మిట్ చేసుకుని లక్షల రూపాయలు వసూలు చేసే కార్పోరేట్ ఆస్పత్రుల అసలు స్వరూపాన్ని కరోనా అర్ధం అయ్యేలా చెప్పింది. నిరుపేదలకు, సామాన్యులకు వైద్యం అందించే వైద్యుల నిరంతర శ్రమ ఎలా ఉందో కరోనా ప్రభావంతో ప్రజలకు అర్ధం అవుతుంది .

ఏపీలో కరోనా రాజకీయం .. ఎన్నికల కమీషనర్ కు చంద్రబాబు లేఖ

కరోనా ప్రభావంతో ప్రభుత్వ వైద్యులపై మారిన అభిప్రాయం

కరోనా ప్రభావంతో ప్రభుత్వ వైద్యులపై మారిన అభిప్రాయం

ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించటం కోసం నిరంతరం ప్రభుత్వ వైద్యులు కష్టపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ వైద్యుల విషయంలో జనాలకు ఉన్న అపోహలు ఇప్పుడు దూరం అవుతున్నాయి . ప్రభుత్వ ఆస్పత్రుల్లో పట్టించుకోరని, ప్రజలకు మెరుగైన వైద్యం చెయ్యరని భావించిన జనాలకు ఇప్పుడు ప్రభుత్వ వైద్యులు దేవుళ్ళుగా కనిపిస్తున్నారు . ప్రాణాలను పణంగా పెట్టి మరీ వారు కరోనా పాజిటివ్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రనక పగలనక బాధితుల ప్రాణాలు కాపాడటం కోసంపాటు పడుతున్నారు.

కార్పోరేట్ ఆస్పత్రులు వెలవెల.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్స్ కిటకిట

కార్పోరేట్ ఆస్పత్రులు వెలవెల.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్స్ కిటకిట

ఇక ఎలాంటి రోగమైనా మేము చాలా కేర్ తో చూసుకుంటాము అని గొప్పలు చెప్పుకున్న కార్పోరేట్ ఆస్పత్రుల వాళ్ళు ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో కరోనా వైద్యంతో మాకు సంబంధం లేదంటూ , సాధ్యమైనంత వరకు జలుబు, దగ్గు జ్వరం తో వచ్చే పేషెంట్లను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కార్పోరేట్ ఆస్పత్రుల్లో గతంలోలా వైద్యుల హడావిడి లేదు . రోగులతో క్రిక్కిరిసిన పరిస్థితులు లేవు .

కరోనా పేషెంట్లకు వైద్యం చెయ్యాలంటే కార్పోరేట్ ఆస్పత్రులకు టెన్షన్

కరోనా పేషెంట్లకు వైద్యం చెయ్యాలంటే కార్పోరేట్ ఆస్పత్రులకు టెన్షన్

ఒకపక్క ప్రభుత్వ వైద్యులు ప్రజల ప్రాణాల కోసం అహర్నిశలు కష్టపడుతుంటే , ప్రైవేట్ వైద్యులు మాత్రం మాకేం సంబంధం లేదు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బాగా ప్రాక్టీస్ ఉన్న చాలా మంది వైద్యులు కరోనా పేషెంట్లను తమ ఆస్పత్రికి రాకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయట నుండి బయటే గెంటేస్తున్న పరిస్థితి ఉంది . దేశ వ్యాప్తంగా ఎప్పుడూ రష్ ఉండే కార్పోరేట్ ఆస్పత్రులలోనూ ఇన్ పేషెంట్ లను తీసుకోవాలంటే భయపడుతున్న పరిస్థితి .

 రిస్క్ తీసుకోవటం ఇష్టం పడని కార్పోరేట్ వైద్య బృందం .. మీ కోసం మేం అంటున్న ప్రభుత్వ వైద్యులు

రిస్క్ తీసుకోవటం ఇష్టం పడని కార్పోరేట్ వైద్య బృందం .. మీ కోసం మేం అంటున్న ప్రభుత్వ వైద్యులు

ఇక లాక్ డౌన్ నేపధ్యంలో ఇతరత్రా సమస్యలతో బాధ పడుతున్న వారు కూడా ఆస్పత్రులకు రావాలంటే భయపడుతున్నారు. ఉపశమనం కోసం మందులు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు . లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొన్ని సార్లు ఎమర్జెన్సీ కేసులు కూడా తీసుకోకపోవటం బాధితులను ఆవేదనకు గురి చేస్తుంది. మాకెందుకు రిస్క్ అన్న చందంగా కార్పోరేట్ వైద్యులు వ్యవహరిస్తే , మీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాం అన్న చందంగా ప్రభుత్వ వైద్యులు పని చెయ్యటం నిజంగా ప్రశంసనీయం .

English summary
On the one hand, the government doctors are concerned that the lives of the people , while the private doctors have nothing to do with it. Many well-practiced physicians take care of corona patients without having to go to their hospital. There is a situation of getting out of the way. Even in the ever-rush corporate hospitals across the country, inpatients are afraid to take in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more