• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

30 కోట్ల మందికి కరోనా హై రిస్క్ .. వ్యాక్సిన్ ఇవ్వటానికి పోల్ బూత్ లాంటి వ్యవస్థ : నీతి ఆయోగ్

|

కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. హై రిస్క్ గ్రూపులుగా వర్గీకరించబడిన 30 కోట్ల మందికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేవారిలో ముందు వరుసలో కరోనా నియంత్రణ కోసం పోరాడిన ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు ఉంటారు. ఆ తర్వాత 65 సంవత్సరాల వయస్సు పైబడిన వారు, తరువాత అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటారని కేంద్రం రాష్ట్రాలకు చెప్పింది.

వ్యాక్సిన్ లేకుండానే కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కోవాలి : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

 టీకా కేంద్రాల కోసం పోల్ బూత్ లాంటి వ్యవస్థ ఏర్పాటు

టీకా కేంద్రాల కోసం పోల్ బూత్ లాంటి వ్యవస్థ ఏర్పాటు

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో టీకా కేంద్రాల కోసం పోల్ బూత్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని , బ్లాక్ లెవల్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె పాల్ నిన్న ముఖ్యమంత్రులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ , ప్రైవేట్ వైద్యులకు ఈ విషయంలో ప్రత్యేక బాధ్యత ఉంటుందని, ప్రజల భాగస్వామ్యం మరియు శిక్షణ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్ చెప్పారు. వ్యాక్సిన్ రావటం ఎంత అవసరమో వ్యాక్సిన్ పంపిణీ సజావుగా జరగటం అంతే ప్రాధాన్యతాంశంగా

భావిస్తున్నారు.

బీజేపీయేతర పార్టీలు పాలిత నాలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇలా

బీజేపీయేతర పార్టీలు పాలిత నాలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఇలా

ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కార్యదర్శి రాజేష్ భూషణ్ సమర్పించిన నివేదికలో బీజేపీయేతర పార్టీలు పాలిత నాలుగు రాష్ట్రాలు అయిన ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ మరియు రాజస్థాన్ లలో గత ఒక వారంలో అధికంగా పాజిటివ్ కేసులు వచ్చాయని మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. గత వారంలో ఢిల్లీలో రోజుకు సగటున 111 మంది మరణించినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది . ఇప్పటివరకు బాగా పనిచేసిన రాజస్థాన్ గత వారం నుండి 21% టెస్ట్ పాజిటివిటీ రేటును నివేదిస్తోంది. సగటు టెస్ట్ పాజిటివిటీ రేటు కేరళలో 15.3% కాగా ఢిల్లీలో 13.5% అధికంగా ఉన్నాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర లలో పెరుగుతున్న కేసులు

ఢిల్లీ, మహారాష్ట్ర లలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో గత వారంలో అత్యధిక సగటు రోజువారీ మరణాలు 93 గా ఉన్నాయి. అయినప్పటికీ మహారాష్ట్ర పాజిటివిటీ సగటును 8.2 శాతానికి తగ్గించగలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే కరోనా నియంత్రణలోకి వస్తుంది అని ప్రధాని, షాకు హామీ ఇచ్చారు . గత వారం అత్యధికంగా 8,600 కేసులను నమోదు చేసిన దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు మరియు కేసుల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గుతుందని చెప్పారు. పెరుగుతున్న కోవిడ్ కేసులకు కారణంగా వాయు కాలుష్యాన్ని గురించి ఆయన పేర్కొన్నారు .

కాలుష్య నివారణకు ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం కోరిన ఢిల్లీ సీఎం

కాలుష్య నివారణకు ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం కోరిన ఢిల్లీ సీఎం

ఢిల్లీలో వాయు కాలుష్యం నివారించడానికి ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధానితో మాట్లాడుతూ ప్రజా జీవితం రాష్ట్రంలో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అయితే కొన్ని రాజకీయ పార్టీలు బయటకొచ్చి ఆందోళనలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి అని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోగ్య ప్రమాణాలను ఉల్లంఘించడం చేస్తున్నాయి అని ఆరోపించి బిజెపిపై దాడి చేశారు.

English summary
Around 30 crore people categorised as high-risk group will be vaccinated on a priority bases, with frontline workers at the front of the queue, followed by people above 65 years and then those with co-morbidities, states have been told.Niti Aayog member VK Paul, while making a presentation to the chief ministers on Tuesday, said poll booth-like teams will be constituted for vaccine centres and a block-level strategy has been prepared. Paul said government and private doctors will have special responsibility and efforts are being made for public participation and training too
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X