వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కరోనా : 8 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు , రెండు నెలల కనిష్టానికి మరణాలు

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకు తగ్గుతున్న కేసులు భారతదేశానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. గత 24 గంటల్లో 62,480 కొత్త కరోనా కేసులను భారతదేశం నివేదించింది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. నిన్నటితో పోలిస్తే కొత్త కేసులలో కాస్త తగ్గుదల కనిపించింది. దీంతో ఇప్పుడు భారతదేశంలో మొత్తం కేసులు 2.97 కోట్లకుపైగా నమోదయ్యాయి.

కరోనా నుండి ఉపశమనం పొందుతున్న భారత్ .. 8 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులుకరోనా నుండి ఉపశమనం పొందుతున్న భారత్ .. 8 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు

రోజువారీ మరణాల్లో భారీ తగ్గుదల

రోజువారీ మరణాల్లో భారీ తగ్గుదల

ఇక రోజువారి మరణాల్లో కూడా చాలా రోజుల తర్వాత తక్కువ మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో రోజువారి మరణాలు రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.గత 24 గంటల వ్యవధిలో 1587 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకూ చూస్తే దేశవ్యాప్తంగా మొత్తం 3,83,490 మంది కరోనా మహమ్మారి కి బలైపోయారు.మరోవైపు క్రియాశీల కేసులను గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

8 లక్షలకు దిగువకు చేరుకున్న యాక్టివ్ కేసులు

8 లక్షలకు దిగువకు చేరుకున్న యాక్టివ్ కేసులు

ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఎనిమిది లక్షల దిగువకు చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల రేటు 2.78 శాతానికి చేరుకోగా, రికవరీ రేటు 95.93 శాతానికి చేరుకుంది. ఇదిలా ఉంటే భారతదేశం యొక్క రోజువారీ పరీక్షల పాజిటివిటీ రేటు కూడా తగ్గుతుంది. ఇది పదకొండవ రోజు 5 శాతం కంటే తక్కువగా 3.24 శాతంగా ఉంది. ఇక కరోనా మహమ్మారి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. దాని తరువాత కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

నిన్న ఒక్క రోజు కరోనా నుండి కోలుకున్న వారు 88,943 మంది

నిన్న ఒక్క రోజు కరోనా నుండి కోలుకున్న వారు 88,943 మంది

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 26.89 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను అందించారు. ప్రస్తుతం, 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ యాక్టివ్ కేసులు 5,000 కన్నా తక్కువ నమోదవుతున్నాయి. ఇదే సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా తగ్గుతున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. కరోనా కారణంగా నిన్న ఒక రోజు 88,943 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పుడు దేశంలో మొత్తం రికవరీలు 2.85 కోట్లకు చేరుకున్నాయి.

73రోజుల తర్వాత 8 లక్షలకు తక్కువగా కరోనా కేసులు

73రోజుల తర్వాత 8 లక్షలకు తక్కువగా కరోనా కేసులు

ఏది ఏమైనప్పటికీ దేశంలో కరోనా కేసులు స్వల్ప హెచ్చుతగ్గులతో లక్షకు తక్కువగానే నమోదవుతుందని గమనార్హం. కరోనా కేసుల రికవరీలు పెరిగి, మరణాలు తగ్గడం దేశానికి ఊరటనిస్తున్న అంశం.
డెబ్బై మూడు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు 8 లక్షలకు దిగువగా చేరుకోవడం గమనార్హం . దేశంలో ప్రస్తుతం 7,98,656 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో మరణాల రేటు 1.29 శాతంగా ఉంది.

English summary
India on Friday registered 62,480 cases and 1,587 deaths due to the coronavirus disease (Covid-19), taking the caseload and death toll to 29,762,793 and 383,490 respectively, according to the Union health ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X