భారత్ లో కరోనా: రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ; తాజాగా 28 వేలకు పైగా కేసులు, 260 మరణాలు
భారతదేశంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అంతకు ముందు రోజు తో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 28,326 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్న గణాంకాల కంటే (29,616) 4.3 శాతం తక్కువగా ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 33.65 మిలియన్లకు చేరుకుంది. దేశం గత 24 గంటల్లో 260 మరణాలను నివేదించింది.

పెరుగుతున్న క్రియాశీల కేసులు , మూడు లక్షలకు పైగా
గత 24 గంటల్లో భారతదేశంలో 14,88,945 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో కోవిడ్ బారినుండి 26,032 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు భారతదేశంలో కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 3.29 కోట్లుగా ఉంది. ఇక కోలుకున్న వారి శాతం 97.77 శాతం గా ఉంది. కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 3,03,476 గా ఉంది. క్రియాశీల కేసుల శాతం 0.90 శాతం గా ఉంది. ఇప్పటివరకు కరోనా కారణంగా 4,46,918 మంది ప్రాణాలు కోల్పోయారు.

కేరళలోనే మొత్తం రోజువారీ కేసులలో సగానిపైగా కేసులు
ఇదిలా ఉంటే భారతదేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు - 100 కి గుర్తించబడిన పాజిటివ్ కేసుల సంఖ్య - 1.90 శాతంగా ఉంది. కేరళ, అత్యధిక రోజువారీ కేసులు ఉన్న రాష్ట్రంగా కొనసాగుతుంది. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 16,671 కేసులు మరియు 120 కోవిడ్ మరణాలు సంభవించాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో 787 కొత్త కేసులు మరియు 11 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.
1 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లోని థియేటర్లు మరియు పబ్‌లలో 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దసరా ఉత్సవాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో కఠినమైన నిఘా ఉంచబడుతుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.

మహారాష్ట్రలో ఆంక్షలను తొలగిస్తున్న ప్రభుత్వం
మహారాష్ట్ర, ఒక రోజులో 3,276 కేసులు మరియు 58 కోవిడ్ మరణాలను నివేదించింది. మహారాష్ట్రలోని అన్ని సినిమా హాళ్లు అక్టోబర్ 22 తర్వాత తెరవడానికి అనుమతించబడుతాయని, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ఆంక్షలను తరలిస్తున్నట్టు ట్వీట్ ద్వారా తెలిపారు.దేశ రాజధాని ఢిల్లీలో 27 కొత్త కేసులు మరియు సున్నా కోవిడ్ మరణాలు పాజిటివిటీ రేటు 0.04 శాతానికి పడిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా కారణంగా ముగ్గురు మరణించారు .

మిజోరాంలో బాగా పెరుగుతున్న కేసులు
పర్యాటక ప్రాంతమైన గోవాలో పర్యాటకుల కారణంగా 84 కొత్త కేసులు మరియు సున్నా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.1,478 కోవిడ్ కేసులతో ఉన్న మిజోరామ్ ఈశాన్య రాష్ట్రాలలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులలో ముందంజలో ఉంది. రాష్ట్రం కూడా రెండు కోవిడ్ మరణాలను నివేదించింది. అసోంలో 375 కేసులు, నాలుగు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యుఎస్‌ఎఐడి) 56 మిలియన్లకు పైగా భారతీయులకు కోవిడ్ సంబంధిత ఆరోగ్య శిక్షణ, రిస్క్ తగ్గించడం మరియు వ్యాక్సిన్ సమాచారం తో పాటు అవసరమైన పరికరాలను అందించింది.

కొనసాగుతున్న వ్యాక్సినేషన్ .. లెక్కలు ఇవే
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 68,42,786 మందికి వ్యాక్సిన్ టీకాలు అందించారు దీంతో ఇప్పటి వరకూ అందించిన మొత్తం టీకా డోసులు సంఖ్య 85,60, 81,527. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే అని కేంద్ర నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications