వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

corona India: కాస్త తగ్గిన కోవిడ్ కేసుల ఉధృతి..దేశంలో తాజా కరోనా పరిస్థితి ఇదే!!

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. నిన్నటి కంటే కాస్త తక్కువ కేసులు నమోదు కావడం దేశానికి కాస్త ఊరటనిచ్చింది. గత 24 గంటల్లో భారతదేశం యొక్క రోజువారీ కరోనావైరస్ వ్యాప్తిలోస్వల్ప క్షీణత కనిపించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,23,144 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశం మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డాష్‌బోర్డ్ చూపించింది.

24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,23,144 కొత్త కరోనా కేసులు, 2,771 మంది మృతి

24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,23,144 కొత్త కరోనా కేసులు, 2,771 మంది మృతి

ఏప్రిల్ 22న మొదటిసారిగా 3,14,835 కొత్త కేసులు నమోదు కాగా, అప్పటి నుండి 300,000 కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మూడు లక్షలకు పైగా కరోనా కేసులు కనుగొనబడిన ఆరవ రోజు ఇది. గత 24 గంటలలో 2,771 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా సంబంధిత మరణాల సంఖ్య 197,894 కు చేరుకుంది. ఇక భారత దేశంలో కరోనా మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని తాజా లెక్కల ద్వారా తెలుస్తుంది. ఇది మొత్తం జాతీయ లెక్కలో 1.12% గా ఉంది.

కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204 , పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య

కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204 , పెరుగుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య

ఇప్పటి వరకు దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది. ఇదిలా ఉంటే రికవరీలు కూడా బాగానే నమోదవుతున్నా కేసుల పెరుగుదలతో చూస్తే ఇంకా ఎక్కువ రికవరీలు నమోదు కావాల్సి ఉంది. భారతదేశంలో నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 2,51,827 మంది. మొత్తంగా కోటి నలభై ఐదు లక్షల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా ఇప్పటివరకు రికవరీ రేటు 82.62 శాతానికి పడిపోయింది.

మహారాష్ట్ర, ఢిల్లీలలోనూ కాస్త నెమ్మదించిన కరోనా కేసులు .. ఈ రోజు లెక్కలివే

మహారాష్ట్ర, ఢిల్లీలలోనూ కాస్త నెమ్మదించిన కరోనా కేసులు .. ఈ రోజు లెక్కలివే

ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే 33,59,963 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా 14,52,71,186 డోసులను పంపిణీ చేసినట్లుగా తెలుస్తుంది. కరోనా మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర ,ఢిల్లీలలో కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది . మహారాష్ట్రలో గత 24 గంటల్లో 48 ,700 మందికి కరోనా సోకగా 524 ఇదిలా ఉంటే మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో 20,201 మంది గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు.380 మంది కరోనా కారణంగా మరణించారు.

కరోనా కట్టడి అందరి బాధ్యత .. ప్రభుత్వాల కట్టడి యత్నాలే కాదు, ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

కరోనా కట్టడి అందరి బాధ్యత .. ప్రభుత్వాల కట్టడి యత్నాలే కాదు, ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎక్కడికక్కడ స్థానికంగా ఆంక్షలు విధిస్తూ కట్టడి యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ప్రజలు కూడా తమ వంతుగా బాధ్యతా యుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం పాటించటం , గుంపులుగా తిరగకుండా ఉండటం , మాస్కులు ధరించటం , శానిటైజేషన్ చేసుకోవటం , శుభ్రత పాటించటం చెయ్యాల్సిన అవసరం ఉంది . తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకకుండానే కాపాడుకునే అవకాశం ఉంటుంది . కరోనా బారిన పడ్డాక ఇబ్బందులు పడటం కంటే ముందస్తు జాగ్రత్తలు పాటించటమే అవసరం అని అందరూ గుర్తించాలి.

English summary
In a marginal fall in India’s daily caseload of the coronavirus disease (Covid-19), 323,144 new cases were detected across the country in the preceding 24 hours, taking the country’s infection tally to 17,636,307. The last 24 hours also saw 2,771deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X