భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా.. 24 గంటల్లో ఐదుగురి మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఒక్కో దేశానికి విస్తరిస్తుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇక మన దేశంలో సైతం చాపకింద నీరులా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. నేటికీ ( జూన్ 3, 2025 ) నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 4 వేల మార్కును దాటినట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా నమోదవుతుండడం ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఐదుగురు ఈ మహమ్మారికి బలయ్యారని వైద్యులు ప్రకటించారు.

ప్రస్తుతం దేశంలో మొత్తం 4,026 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉండగా.. కేరళలో మాత్రమే యాక్టివ్ కేసుల సంఖ్య 1,416కి చేరింది. ఈరోజు ఇప్పటి వరకు కేరళలో 171 కొత్త కేసులు వెలుగుచూసినట్టు స్పష్టం అవుతోంది. మరోవైపు ఢిల్లీలో 393, మహారాష్ట్రలో 69 కొత్త కేసులు 494, పశ్చిమ బెంగాల్‌లో 372 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ ధృవీకరించారు. ప్రస్తుతానికి ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోవిడ్-19 JN 1 వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం, అలసట, తలనొప్పి గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్నకొత్త వేరియంట్‌లు.. గతంలో ఉన్న వాటి కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని అంటున్నారు.












Click it and Unblock the Notifications