ఇండియాలో కరోనా కొత్త రికార్డులు .. లక్షకు చేరువగా కొత్త కేసులు,1201 మరణాలు
ఇండియాలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ భారత్ రోజువారి కేసులలో జెట్ వేగంతో దూసుకుపోతుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో గడచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 97,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షకు చేరువలో ఒకరోజు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది . ఇప్పటివరకు ఒకరోజు నమోదైన అత్యధిక కేసులుగా ఇండియా కొత్త రికార్డును సృష్టించింది.

46 లక్షలను దాటి కరోనా కేసులు ... 24 గంటల్లో 97,570 కొత్త కేసులు , 1201 మరణాలు
ఒక రోజు కేసుల పెరుగుదల వేగంలో భారత్ ప్రపంచ దేశాల్లోనే ప్రధమ స్థానంలో ఉంది. లక్షకు చేరుకున్న కొత్త కేసులతో పాటు గత 24 గంటల్లో 1201 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తాజా గణాంకాల ప్రకారం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 46,60,133 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారినపడి 77, 526 మంది మరణించారు. కరోనా నుండి కోలుకొని గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 81,553 కాగా , దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,58,316 గా ఉంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,24,196గా ఉంది.

మహారాష్ట్రలో కరోనా పంజా .. తర్వాత స్థానంలో ఏపీ
ఇండియాలో కరోనా కేసులలో మహారాష్ట్ర అత్యంత ప్రభావితం అయిన తొలిరాష్ట్రంగా ఉంది . మహారాష్ట్రలో కరోనా కేసులు 10,15,681 గా ఉంది. యాక్టివ్ కేసులు 2, 71,566 గా ఉన్నాయి . మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇప్పటివరకు 5,47,686 కేసులు నమోదు కాగా 96,191 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా నుండి కోలుకుని 4,46,716 డిశ్చార్జి కాగా 4,779 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

మూడో స్థానంలో తమిళనాడు , ఆ తర్వాత కర్ణాటక, యూపీ
ఆంధ్ర ప్రదేశ్ తర్వాత స్థానంలో తమిళనాడు లో కరోనా కల్లోలం కొనసాగుతుంది. తమిళనాడులో 4,91, 571 కేసులు ఇప్పటివరకు నమోదుకాగా 47,915 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక రాష్ట్రం , ఐదవ స్థానంలో ఉత్తరప్రదేశ్ కరోనా కేసు నమోదు లో నిలిచాయి.
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 77.77 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తోంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.56 శాతంగా ఉండగా, కరోనా మరణాలు శాతం 1.66గా ఉంది.












Click it and Unblock the Notifications