భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ..హైదరాబాద్‌లో ఒకరి పరిస్థితి విషయం.. అదుపుతప్పితే లాక్‌డౌన్ విధింపు..
భారత్‌లో మహమ్మారి ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య ప్రతిరోజు పదుల సంఖ్యలో నమోదువుతున్నాయి. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాపించింది. తాజాగా మహారాష్ట్రలో ఆరు, గుజరాత్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 153కు చేరింది.

దేశంలో 153 కేసులు.. మహారాష్ట్రలో అత్యధికంగా 54..
దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 54 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్ర గణాంకాల ప్రకారం ఢిల్లీలో 22, తెలంగాణలో 20, రాజస్థాన్ లో 17, కర్ణాటకలో 14 కేసులు, గుజరాత్ 11, కేరళ 11, ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగడ్ లలో 1 చొప్పున రికార్డైనట్లు వెల్లడించింది. వీరందరికి ఆస్పత్రులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని, వారిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు.

ఒకరి పరిస్థితి విషమం?
అయితే తెలంగాణలో ఇప్పటివరకు 20 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వారందరిని టిమ్స్ కు తరలించారు . అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని టిమ్స్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అటు మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

నమూనా ఫలితాలు వచ్చేవరకు ఎయిర్ పోర్టులోనే..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మరింత అప్రమత్తమైంది. రిస్క లేని దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగే ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహించి.. ధాని ఫలితం వచ్చేవరకు వారిని అక్కడే ఉంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణికుల నుంచి నమూనాలు సేకరించిన అనంతరం వారిని ఇళ్లకు పంపించేవారు. అయితే ప్రయాణికులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇకనుంచి విదేశాలనుంచి వచ్చే వారికి నమూనాలు సేకరించి దాని ఫలితం వచ్చేవరకు ఎయిర్ పోర్టులోనే వారిని ఉంచాలని నిర్ణయించారు అధికారులు.

అదుపుతప్పితే లాక్ డౌన్ .. రాష్ట్రాలకు కేంద్రం సూచన
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే స్పీడ్ గా వ్యాప్తి చెందుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని , ఆ జాగ్రత్త వహించవద్దని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరింది. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. అవసరమైతే రాతిళ్లు కర్ప్యూ, లాక్ డౌన్ విధించుకోవాలని కేంద్రం సూచించింది .












Click it and Unblock the Notifications