Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీ ఎన్నికలకు కరోనా టెర్రర్: అయోధ్య విజయ రథయాత్ర రద్దు; అఖిలేష్ యాదవ్ కీలకనిర్ణయం

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అయోధ్యలో జనవరి 9న జరగాల్సిన సమాజ్ వాదీ పార్టీ విజయ రథయాత్ర రద్దు చేస్తూ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జనవరి 7 మరియు జనవరి 8 న ఉత్తరప్రదేశ్‌లోని గోండా, బస్తీలలో తన ఇతర ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు.

 ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కరోనా ఎఫెక్ట్ ..విజయ రథయాత్ర రద్దు

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కరోనా ఎఫెక్ట్ ..విజయ రథయాత్ర రద్దు

ఫిబ్రవరి-మార్చి నెలలో దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు నిర్వహించే ర్యాలీలకు పెరుగుతున్న కరోనా కేసుల తీరు అడ్డంకిగా మారింది. గతంలో మాదిరిగా ఇప్పుడు మరోమారు అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ చేపట్టిన విజయ రథయాత్రను రద్దు చేయడమే కాకుండా, శుక్ర శనివారాల్లో నిర్వహించవలసిన ర్యాలీలను కూడా రద్దు చేసుకున్నారు.

 ఫ్యామిలీకి కరోనా కారణంగా యూపీలో గతనెలలో ర్యాలీ రద్దు చేసిన అఖిలేష్ యాదవ్

ఫ్యామిలీకి కరోనా కారణంగా యూపీలో గతనెలలో ర్యాలీ రద్దు చేసిన అఖిలేష్ యాదవ్

గత నెల, అఖిలేష్ యాదవ్ పశ్చిమ యుపిలో ఓ ర్యాలీని రద్దు చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య మరియు కుమార్తె కరోనా పాజిటివ్ పరీక్షించిన నేపథ్యంలో ఆయన మూడు రోజుల పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా అని వెల్లడించారు. తన కుటుంబ సభ్యులకు కరోనా మహమ్మారి సోకిన కారణంగా ముందు జాగ్రత్త చర్యగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ తన కోవిడ్-నెగటివ్ నివేదికను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఎన్నికల రాష్ట్రాల్లో ప్రధాన ర్యాలీలను వాయిదా వేసిన కాంగ్రెస్

ఎన్నికల రాష్ట్రాల్లో ప్రధాన ర్యాలీలను వాయిదా వేసిన కాంగ్రెస్

కోవిడ్ కేసుల మూడవ వేవ్ ఊహించిన దృష్ట్యా పెద్ద ర్యాలీలను (రాష్ట్రంలో) రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.అత్యధికంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా నడపబడుతున్నట్లు విశ్వసిస్తున్న కేసుల ఇటీవలి పెరుగుదల కారణంగా ఎన్నికలకు వెళ్లే రాష్ట్రంలో కాంగ్రెస్ తన అన్ని కార్యక్రమాలను వాయిదా వేసింది. యుపి మాత్రమే కాదు ఎన్నికలకు వెళుతున్న ఇతర రాష్ట్రాలలో ప్రధాన ర్యాలీలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తమ రాష్ట్రాల్లోని కోవిడ్-19 పరిస్థితిని అంచనా వేయాలని, ఆపై ర్యాలీలు నిర్వహించడంపై నిర్ణయం తీసుకోవాలని మేము రాష్ట్ర యూనిట్లను కోరామని పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చెప్పారు.

యూపీ సీఎం యోగి కూడా ప్రభుత్వ కార్యక్రమం రద్దు

యూపీ సీఎం యోగి కూడా ప్రభుత్వ కార్యక్రమం రద్దు

మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని గౌతంబుద్ధ్ నగర్ జిల్లాలో గురువారం నాడు జరగాల్సిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు.అధికారిక కారణం చెప్పనప్పటికీ, గత వారంలో రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయని, కరోనా ఆందోళన నేపథ్యంలో కూడా కార్యక్రమాన్ని రద్దు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

Recommended Video

    Swami Paripoornananda Slams Ys Jagan.. హిందూ పండగలపై ఆంక్షలెందుకు? | Oneindia Telugu
     ఎన్నికలు వాయిదా వెయ్యబోమని తేల్చిన ఎన్నికల కమీషన్

    ఎన్నికలు వాయిదా వెయ్యబోమని తేల్చిన ఎన్నికల కమీషన్

    యుపి ఎన్నికలను కొన్ని నెలలు మాత్రమే వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు గత నెలలో ఎన్నికల సంఘాన్ని కోరింది.అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైన తర్వాత, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల సమయంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నివారణ చర్యల పైన కూడా ఎన్నికల కమీషన్ దృష్టి సారించింది. ఓటింగ్ గంటలను పొడిగించడం, ఓటింగ్ బూత్‌ల సంఖ్యను పెంచడం పై దృష్టి సారించింది. పదివేల మంది హాజరయ్యే మరియు సామాజిక దూరం లేని రాజకీయ ర్యాలీలను అనుమతించవద్దని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+