Corona Vaccine: వ్యాక్సిన్ వేసుకుని ఇంటికి వెలుతుంటే మహిళ ప్రాణం పోయింది, ఏం జరిగింది ?

బెంగళూరు: కరోనా వైరస్ రక్కసిని ఎదుర్కొనేందుకు భారత్ చేపట్టిన బృహత్తర టీకా కార్యక్రమం కీలక మైలురాయిని దాటింది. కేవలం 9 నెలల్లో దేశవ్యాప్తంగా 100 కోట్లకు పైగా డోసులను పంపిణి చేసిన భారత ప్రభుత్వం అరుదైన కీర్తిని గడించింది .ఇలాంటి సమయంలో కోవిడ్ టీకా వేసుకున్న ఓ మహిళ కొన్ని గంటల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది.

బెంగళూరులోని కామాక్షిపాళ్యలోని లక్ష్మణ నగర్ లో మంగళా (36) అనే మహిళ ఆమె భర్త దినేష్ తో కలిసి నివాసం ఉంటున్నది, ఉదయం 11.20 గంటల సమయంలో కామాక్షిపాళ్య సమీపంలోని హెగ్గనహళ్ళి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన మంగళా కోవిడ్ టీకాను వేసుకుంది. కొంతసేపు అక్కడే ఉన్న మంగళా తరువాత ఆమె ఇంటికి బయలుదేరింది.

 Corona Vaccine: A woman who has been vaccinated for coronavirus has collapsed and died in Bengaluru.

మార్గం మద్యలో ఇంటి సమీపంలోని మార్కెట్ దగ్గర వెలుతున్న మంగళా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే మంగళాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మంగళా ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారని స్థానికులు అంటున్నారు.

Recommended Video

    చిన్నారులకు Covid-19 Vaccine వచ్చేసిందోచ్.. ఎప్పటినుంచి అంటే...! || Oneindia Telugu

    హెగ్గనహళ్ళిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ టీకా వేసుకున్న కొంతసేపటికే మంగళా మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ టీకా కారణంగా మంగళా చనిపోలేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. అయితే మంగళా మరణానికి అసలు కారణాలు ఏమిటి అనే విషయం ఇంకా అంతుచక్కిడం లేదని అధికారులు అంటున్నారు. అనుమానాస్పద స్థితిలో మంగళా మరణించిందన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కామాక్షిపాళ్య పోలీసులు అంటున్నారు. పోస్టుమార్టం నివేదికలో మంగళా ఎలా చనిపోయింది అనే విషయం వెలుగు చూస్తుందని అధికారులు అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+