తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: అ, ఆలు మరిచిపోతున్నారు, ఆన్ లైన్ క్లాసుల ఎఫెక్ట్, వాలంటీర్ల సర్వేలో పచ్చి నిజాలు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ బెంగళూరు/ హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో విద్యార్థులు అ, ఆలు కూడా మరిచిపోయే పరిస్థితి ఎదురైయ్యిందని సర్వేలో వెలుగు చూడటంతో ప్రజలు షాక్ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 37శాతం మంది విద్యార్థులు అస్సలు చదువుకోవడం లేదని వెలుగు చూసింది. గ్రామీణ ప్రాంతాల్లోని 97 శాతం మంది తల్లిదండ్రులు కరోనా వైరస్ దెబ్బతో వారి పిల్లలను స్కూల్ కు పంపించడానికి ఆలోచిస్తున్నారని వాలంటీర్లు నిర్వహించిన సర్వేలో పచ్చి నిజాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో పిల్లలు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారని ఇంతకాలం అందరికీ తెలిసిందే. అయితే ఎంత శాతం మంది ఆన్ లైన్ లో చదువుతున్నారు ?, ఆన్ లైన్ పాఠాలు ఎంత మంది బుర్రలకు ఎక్కుతున్నాయి అనే విషయం వెలుగు చూసింది. స్కూల్స్ ప్రారంభం అయిన నెలలోనే నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Illegal affair: ఆంటిని చంపేసి ఇంట్లో అంత్యక్రియలు. చిల్లీ పౌడర్ చల్లేసి ప్రియుడు ఎస్కేప్ !Illegal affair: ఆంటిని చంపేసి ఇంట్లో అంత్యక్రియలు. చిల్లీ పౌడర్ చల్లేసి ప్రియుడు ఎస్కేప్ !

వాలంటీర్ల సర్వే

వాలంటీర్ల సర్వే


కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బతో మరోసారి విద్యాసంస్థలు అన్నీ మూతపడిన విషయం తెలిసిందే. కరోనా దెబ్బతో 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది సక్రమంగా చదువు కుంటున్నారు, విద్యాసంస్థలు మూసివేయడంతో ఎంత మంది మీద ప్రభావం చూపించింది అంటూ వాలంటీర్లు సర్వే నిర్వహించారు. 2021 ఆగస్టు నెలలోనే వాలంటీర్లు సర్వే నిర్వహించారు.

Ganesh Chaturthi: దేశమంతటా గణేష్ విగ్రహాల తయారి.. భక్తుల కోలాహలం మొదలైంది (ఫొటోస్)

ఆన్ లైన్ లో పక్కాగా 8 శాతం మంది మాత్రమే

ఆన్ లైన్ లో పక్కాగా 8 శాతం మంది మాత్రమే

దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 8 శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రతిరోజు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారని వాలంటీర్ల సర్వేలో వెలుగు చూసింది. కర్ణాటక, తమిళనాడు, అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, చంఢీగఢ్, ఒడిసా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు సర్వే నిర్వహించారు.

పదాలు మొత్తం మరిచిపోతున్న పిల్లలు

పదాలు మొత్తం మరిచిపోతున్న పిల్లలు

గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఆన్ లైన్ లో చదువుకుంటున్నారని సర్వేలో వెలుగు చూసింది. 37 శాతం మంది విద్యార్థులు ఏ మాత్రం ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాలేదని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 50 శాతం మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల్లో చదవలేక చాలా శాతం మంది ముందు చదువుకున్న పదాలు కూడా మరిచిపోయారని, చాలా మంది రాయడం, చదవడం మరిచిపోతున్నారని వెలుగు చూడటంతో కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు.

వాట్సాప్ లో లింకులు పంపించి చేతులు దులుపుకున్న టీచర్లు

వాట్సాప్ లో లింకులు పంపించి చేతులు దులుపుకున్న టీచర్లు

పట్టణాల్లోని చాలా విద్యాసంస్థల్లో గత నెల రోజుల నుంచి స్కూల్ టీచర్లను 51 శాతం మంది కలుసుకోలేదని సర్వేలో వెలుగు చూసింది. నెల రోజుల్లో విద్యార్థులకు, టీచర్ల మద్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని సర్వేలో వెలుగు చూసింది. స్కూల్ టీచర్లు విద్యార్థుల కుటుంబ సభ్యుల వాట్సాప్ నెంబర్లకు కేవలం లింక్స్ పంపించి మీరే ఆన్ లైన్ లో చదువుకోవాలని చెప్పి చేతులు దులుపేసుకున్నారని సర్వేలో విద్యార్థుల కుటుంబ సభ్యులు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

మద్యాహ్నం భోజనం ఎఫెక్ట్

మద్యాహ్నం భోజనం ఎఫెక్ట్

మరో పక్క కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో మద్యాహ్నం భోజన పతకం కూడా అటక ఎక్కడంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించడానికి వారి తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఆన్ లైన్ పాఠాల దెబ్బతో పిల్లలు గతంలో చదువుకున్నది కూడా మరిచిపోతున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Coronavirus: 37 % children in rural areas not studying at all, Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X