వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య, కోల్‌కతాలో ఫస్ట్ డెత్, ఇటలీ నుంచి వచ్చిన రోగి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సోకి దేశంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం ఏడు మంది మృతిచెందగా.. సోమవారం మరొకరు చనిపోవడంతో 8కి చేరింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోన్న సంగతి తెలిసిందే.

కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఇది బెంగాల్‌లో మొదటి కరోనా మరణం అని అధికారులు పేర్కొన్నారు. ఇటలీ నుంచి కుటుంబంతో సహా కోల్‌కతా రాగా.. అతని కుమారుడు మాత్రం బాగనే ఉన్నారు. యూపీకి చెందని ఓ వైద్యుడు ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

coronavirus: 55-year-old man dies of Covid-19 in Kolkata, toll at 8 now

పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటు చనిపోయారు. మృతిచెందాక కూడా అతని రక్త నమూనాలు సేకరించిన వైద్యులు.. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. దీంతో దేశంలో వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది. తర్వాత మరొకరు కూడా ఆదివారం చనిపోయారు.

కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడు మృతిచెందారు. ఇటలీ టూరిస్ట్ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న పుణెలో ఒకరు చనిపోవడంతో అది ఆరుకి చేరింది.

English summary
death toll from the novel coronavirus in India increased to eight after a man in Kolkata succumbed to the infection on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X