బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: గర్భిణి డాక్టర్, ప్రజలకు కరోనా చికిత్స, డాక్టర్, బిడ్డ బలి, ఫ్యామిలీ మొత్తం పాజిటివ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తాండవం చేస్తోంది. కరోనా రోగుల కోసం ఆరు నెలల గర్బిణి అయిన డాక్టర్ శక్తి వంచన లేకుండా చికిత్స అందిస్తోంది. ఆరు నెలలు గర్బవతి అయిన లేడీ డాక్టర్ రోజూ ఆసుపత్రికి వెళ్లి రావడానికి ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి పగలు రాత్రి శ్రమించిన గర్బిణి డాక్టర్ ను చివరికి అదే కరోనా వైరస్ (COVID-19) బలి తీసుకుంది. ఇదే సమయంలో కరోనాతో ప్రాణం వదిలిన లేడీ డాక్టర్ కుటుంబ సభ్యులు అందరికీ కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో సాటి వైద్యులు షాక్ అయ్యారు.

Missing lady: ఇంటి పక్కనే పూడ్చేశాడు, 40 రోజుల ముందు ఏం జరిగింది. బుర్కా, నగలు, ఫోన్ ?Missing lady: ఇంటి పక్కనే పూడ్చేశాడు, 40 రోజుల ముందు ఏం జరిగింది. బుర్కా, నగలు, ఫోన్ ?

కేరళ డాక్టర్ దంపతులు

కేరళ డాక్టర్ దంపతులు


కేరళలోని తలకేశి ప్రాంతానికి చెందిన లేడీ డాక్టర్ మా బషీర్ (26), ఆమె భర్త మా హవాశవాఫర్ దంపతులు కర్ణాటకలోని మంగళూరు చేరుకుని నివాసం ఉంటున్నారు. డాక్టర్ మా బషీర్ మంగళూరులోని కణచూరు ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నారు. మా బషీర్ భర్త డాక్టర్ మా హవాశఫర్ మంగళూరులోని ఇండియానా ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నాడు.

ఆరు నెలల గర్బిణి... రోగుల కోసం ఆసుపత్రికి

ఆరు నెలల గర్బిణి... రోగుల కోసం ఆసుపత్రికి

భార్య డాక్టర్ మా బషీర్ ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. గర్బవతి అయిన తరువాత కూడా మా బషీర్ ఆసుపత్రికి వెళ్లి రోగులకు చికిత్స చేస్తున్నారు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో నువ్వు ఆసుపత్రికి వెళ్లకూడదని, ఏదో ఒక రంగా ఎవరో ఒకరి వలన నీకు కరోనా వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు డాక్టర్ మా బషీర్ కు కొన్ని రోజుల నుంచి నచ్చ చెబుతున్నారు.

నా ప్రాణం కాదు.... రోగుల ప్రాణం ముఖ్యం

నా ప్రాణం కాదు.... రోగుల ప్రాణం ముఖ్యం

నా ప్రాణాలు ముఖ్యం కాదని, తాను డాక్టర్ చదివింది రోగులకు చికిత్స చెయ్యడానికి, ఇంట్లో కుర్చోవడానికి కాదని మా బషీర్ మొండిగా ఆసుపత్రికి వెళ్లి రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇటీవల ఆసుపత్రికి వచ్చే రోగులకు మీరు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారని రోగులకు ఆమె పదేపదే చెప్పారని సాటి వైద్యులు, నర్సులు అంటున్నారు.

కరోనాకు చికిత్స, దెబ్బతో డాక్టర్, కడుపులో బిడ్డ బలి

కరోనాకు చికిత్స, దెబ్బతో డాక్టర్, కడుపులో బిడ్డ బలి

కణచూరు ఆసుపత్రిలో రోగులకు పగలు, రాత్రి అని తేడా లేకుండా చికిత్స అందిస్తున్న లేడీ డాక్టర్ మా బిషీర్ కు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. లేడీ డాక్టర్ మా బషీరాతో పాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. అందరికి మంగళూరులోని ఇండియానా ఆసుపత్రిలో చికిత్స అందించారు. కరోనా చికిత్స విఫలమై లేడీ డాక్టర్ మా బషీరా ప్రాణాలు పోవడంతో సాటి వైద్యులు షాక్ అయ్యారు.

Recommended Video

CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations | Oneindia Telugu
కడుపులో బిడ్డ ప్రాణం పోయింది

కడుపులో బిడ్డ ప్రాణం పోయింది

లేడీ డాక్టర్ మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. అయితే కరోనా కాటుతో లేడీ డాక్టర్ తో పాటు ఆమె కడుపులో ఉన్న ఆరు నెలల పసికందు ప్రాణం కూడా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తల్లదిడ్లిపోయారు. లేడీ డాక్టర్ మా బషీర్ కుటుంబ సభ్యులకు కోవిడ్ పాజిటివ్ రావడంతో అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంగళూరు వైద్య శాఖ అధికారులు అంటున్నారు. ఆరు నెలల గర్భిణి డాక్టర్ కరోనా రోగులకు చికిత్స చేస్తూ అదే వ్యాధికి బలి కావడంతో సాటి వైద్యులు షాక్ అయ్యారు.

English summary
Coronavirus: A 25-year-old woman doctor C. C. Maha Basheer who was undergoing treatment for Covid-19 succumbed to the disease. Maha Basheer who was 6 months pregnant was admitted to Indiana hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X