Coronavirus: బర్త్ డే రోజు పూరీలు తినాలని, కేక్ కట్ చెయ్యాలని, కరోనా క్వారంటైన్ లో, పాపం అంతే !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధి దెబ్బకు ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. బర్త్ డే రోజు తనకు తినడానికి పూరీలు కావాలని, సాయంత్రం ఇంట్లో కేక్ కట్ చెయ్యాలని చెప్పిన వ్యక్తి కరోనా క్వారంటైన్ కు వెళ్లి అక్కడ కరోనా పేషంట్స్ ను చూసి భయంతో ప్రాణాలు విడిచారు. మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ప్రసిద్ది చెందిన విక్టోరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే ఆసుపత్రి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వ్యాధితో కొందరు చనిపోతే కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

బర్త్ డే పార్టీ చేసుకోవాలని

బర్త్ డే పార్టీ చేసుకోవాలని

ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలోని గాయిత్రీనగర్ లో నివాసం ఉంటున్న 68 ఏళ్ల వృద్దుడు సోమవారం ఉదయం నిద్రలేవగానే కుటుంబ సభ్యులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు ఆయన బర్త్ డే. తనకు పూరీలు తినాలని ఉందని, చేసి పెట్టాలని, అలాగే సాయంత్రం ఇంట్లో కేక్ కట్ చెయ్యాలని ఉందని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు.

టిఫిన్ చేస్తుంటే కళ్లు తిరిగి!

టిఫిన్ చేస్తుంటే కళ్లు తిరిగి!

ఉదయం ఇంట్లో కుటుంబ సభ్యులు టిఫిన్ తినడానికి పూరీలు చేస్తున్నారు. ఆ సమయంలో వృద్దుడికి కళ్లు కళ్లు తిరగడంతో సోఫాలో పడిపోయారు. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు గాయిత్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. వృద్దుడిని అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేశారు.

క్వారంటైన్ కు తరలిస్తే ప్రాణాలు!

క్వారంటైన్ కు తరలిస్తే ప్రాణాలు!

వృద్దుడికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వెంటనే విజయనగరలోని కరోనా క్వారంటైన్ కు తరలించారు. విజయనగర్ లోని కరోనా క్వారంటైన్ లో సుమారు 40 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అక్కడ అంత మంది కరోనా వ్యాధికి చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న వృద్దుడికి గుండెనొప్పి రావడంతో ప్రాణాలు విడిచారు.

రెండు గంటలు అయినా పట్టించుకోలేదు!

రెండు గంటలు అయినా పట్టించుకోలేదు!

కరోనా క్వారంటైన్ లో వృద్దుడు మరణించడంతో రెండు గంటలు అయినా పోలీసులు కాని, అధికారులు కాని అక్కడికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. బర్త్ డే రోజు పూరీలు తినాలని, కేక్ కట్ చెయ్యాలని కుటుంబ సభ్యులకు చెప్పిన రెండు గంటలకే ఆయన ప్రాణాలు విడచడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు.

Recommended Video

    Lockdown : PM Modi Video Conference With CMs On COVID-19 & Lockdown
    విక్టోరియాలో కరోనా రోగి ఆత్మహత్య

    విక్టోరియాలో కరోనా రోగి ఆత్మహత్య

    బెంగళూరు నగరంలోని సిటీ మార్కెట్ సమీపంలోని ప్రసిద్ది చెందిన విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా క్వారంటైన్ లో ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. కరనా వైరస్ సోకిందని తెలుసుకున్న ఆ వ్యక్తి ఆందోళనకు గురైనాడు. విక్టోరియా ఆసుపత్రి భవనంపైకి వెళ్లిన కరోనా రోగి అక్కడి నుంచి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+