బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: ఆపరేషన్ లాక్ డౌన్, 3 వేల మంది విదేశీయులకు గేట్ పాస్, మోదీ ఓకే, విమానాల్లో జంప్ జిలాని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో బస్సులు, కార్లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలతో పాటు వాహన సంచారం పూర్తిగా స్థంభించాయి. దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ఎక్కడి వారు అక్కడే లాక్ అయ్యారు. బెంగళూరు నగరంతో పాటు దక్షిణ భారతదేశంలోని వివిద రాష్ట్రాల్లో లాక్ డౌన్ సందర్బంగా చిక్కుపోయిన సుమారు 3 వేల మందికి పైగా విదేశీయులను వారివారి దేశాలకు పంపించారు. మొత్తం 22 విమానాల్లో 17 దేశాలకు చెందిన విదేశీయులు బెంగళూరు నుంచి విమానాల్లో జంప్ జిలాని అంటూ బయలుదేరి వెళ్లారు.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్

ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్

కరోనా వైరస్ కట్టడి కోసం గత నెల 24వ తేదీన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. అప్పటి నుంచి మొదటి విడత లాక్ డౌన్ పూర్తి కావడం, రెండో విడత లాక్ డౌన్ 3వ తేదీ వరకు ప్రకటించడం చకచకా జరిగిపోవడంతో విదేశాల నుంచి భారత్ వచ్చిన విదేశీకులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. స్వదేశాలతో పాటు ఎక్కడికి వెళ్లలేక విదేశీయులు గప్ చుప్ గా ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోయారు.

అయ్యా మోదీ గారు, మమ్మల్ని !

అయ్యా మోదీ గారు, మమ్మల్ని !

భారతదేశంలోని వివిద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విదేశీయులు మా దేశాలకు మమ్మల్ని పంపించండి, అయ్యా నరేంద్ర మోదీ గారు మమ్మల్ని పట్టించుకోండి, కాపాడండి అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయితే కరోనా వైరస్ భారత్ లో రోజురోజుకు వ్యాపిస్తున్న సమయంలో విదేశీయుల విషయంపై కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఆచూతితూచి అడుగులు వేసింది.

విదేశీయులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విదేశీయులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బెంగళూరు నగరంతో పాటు దక్షిణ భారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీయుల వివరాలు సేకరించిన కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాల ప్రతినిధులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. విదేశీయులు అందరికి కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయించారు.

17 దేశాలు, 22 విమానాలు

17 దేశాలు, 22 విమానాలు

బెంగళూరు నగరంతో పాటు దక్షిణ భారతదేశంలో లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన విదేశీయులను వారి స్వదేశాలకు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జపాన్, శ్రీలంక, దోహా, బాగ్దాద్, మస్కట్, ప్యారిస్, రియాద్, రోమ్, లండన్ తో పాటు మొత్తం 17 దేశాలకు చెందిన విదేశీయులను 22 విమానాల్లో వారి దేశాలకు పంపించాలని నిర్ణయించారు.

బెంగళూరు నుంచి గేట్ పాస్

బెంగళూరు నుంచి గేట్ పాస్

బెంగళూరు నగరం శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 22 విమానాల్లో విదేశీయులు వారి స్వదేశాలకు బయలుదేరి వెళ్లారు. విమానాలు పూర్తిగా శానిటైజేషన్ చేసి కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది సైతం సమదూరం పాటించి 3 వేల మంది విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బెంగళూరు నుంచి జపాన్ కు ఎక్కువ విమానాలు బయలుదేరి వెళ్లాయి.

English summary
Coronavirus: In the time of lock down around 3,000 stranded foreign nationals flew out of Kempegowda International Airport. As many as 22 special flights were part of this operation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X