వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్కులు పెట్టుకోవడం ప్రమాదమా?: మానవ శరీరంపై 9 గంటలపాటు కరోనావైరస్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రతి పరిశోధనలో కరోనాకు సంబంధించిన కొత్త విషయాన్ని కనుగొంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాసపై ప్రభావం, శరీరంపై కరోనా ఎంత సమయం మనగలుగుతుందనే విషయాలపై తాజాగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు.

 ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా: 50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా: 50వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా

మాస్కులు పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ లభ్యతలో తేడా ఉండదు

మాస్కులు పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ లభ్యతలో తేడా ఉండదు

ఈ పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముఖానికి మాస్కులు పెట్టుకోవడం వల్ల ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్‌లో ఎలాంటి తేడా ఉండదని తేల్చింది. మాస్కులు పెట్టుకోవడం కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. ఆక్సిజన్ లభ్యత వ్యత్యాసం ఉండదని స్పష్టం చేసింది. శ్వాస సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నవారిలోనూ ఆక్సిజన్ లభ్యతలో తేడా ఉండదని తెలిపింది. పలువురు ఆరోగ్యవంతులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిపై పరిశోధనల అనంతరం ఈ మేరకు తేల్చారు. మాస్కు పెట్టుకోక ముందు, పెట్టుకున్న తర్వాత ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించగా ఈ మేరకు తేలిందని వెల్లడించారు.

మాస్కులతో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా..

మాస్కులతో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా..

జర్నల్ థోరాక్స్‌లో పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాసకు సంబంధించిన ఇబ్బందేమీ లేదని, అయితే, మాస్కు ధరించడం వల్ల నరాల కదలికలకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వేడి గాలి, క్లాస్ట్రోఫోబియాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కరోనా లాంటి మహమ్మారి నుంచి మాస్కులతో రక్షణ ఉంటుందని వెల్లడించారు.

మానవ శరీరంపై కొత్త కరోనావైరస్ 9 గంటలపాటు జీవిస్తుంది..

మానవ శరీరంపై కొత్త కరోనావైరస్ 9 గంటలపాటు జీవిస్తుంది..

మానవ శరీరంపై కొత్త కరోనా వైరస్ సుమారు 9 గంటలపాటు జీవిస్తుందని తాజాగా చేసిన అధ్యయనం తేల్చింది. శవాల శరీరంపై ల్యాబ్ ప్రయోగాలు చేసిన అనంతరం నిపుణులు ఈ మేరకు తేల్చారు. మానవ శరీరంపై వైరస్ సమయంలోనే ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. ఇన్ఫ్లూయెంజ ఏ వైరస్ మానవ శరీరంపై రెండు గంటలు మాత్రమే మనగలుతుండగా, కరోనావైరస్ మాత్రం 9 గంటలపాటు జీవించి ఉంటుంది.

శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం ద్వారా..

శానిటైజర్లతో చేతులు కడుక్కోవడం ద్వారా..

80 శాతం ఆల్కాహాల్ కలిగిన హ్యాండ్ శానిటైజర్ వాడటం వల్ల ఈ రెండు వైరస్‌లు కూడా 15 సెకన్లలోపే మరణిస్తాయి. 60-95 శాతం ఆల్కాహాల్ ఉన్న శానిటైజర్లు, సబ్బుతో 20 సెకన్లపాటు చేతులను కడుక్కోవడం ద్వారా వైరస్ ను నాశనం చేయవచ్చని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ సిఫార్సు చేసింది. ద్రవ తుంపరలు, బిందువుల ద్వారా కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని కనుగొన్నారు. చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో కరోనా తీవ్ర ప్రభావం

అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో కరోనా తీవ్ర ప్రభావం

నిద్రలేమితో బాధపడుతున్నవారిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని మరో అధ్యయనం తేల్చింది. అవసరమైన మేరకు నిద్రించేవారి కంటే నిద్రలేమితో బాధపడుతున్నవారిపై వైరస్ ప్రభావం అత్యధికంగా ఉందని తెలిపారు. నిద్రలేమి కారణంగా ఒబెసిటీ, బ్లడ్ ప్రెసర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్ వ్యాధులు, దీంతోపాటు కరోనా కూడా వీరిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

ఇన్ఫ్రారెడ్ ధర్మామీటర్ పెద్దలలో ఖచ్చితంగా ఉండకపోవచ్చు

ఇన్ఫ్రారెడ్ ధర్మామీటర్ పెద్దలలో ఖచ్చితంగా ఉండకపోవచ్చు

నాన్-కాంటాక్ట్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లు, పిల్లలలో ఎక్కువసేపు ఉపయోగించబడుతున్నాయి, ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో జ్వరం కోసం పరీక్షించటానికి ఉపయోగించబడుతున్నాయి, పెద్దవారిలో శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవకపోవచ్చని ఒక చిన్న అధ్యయనం సూచిస్తుంది. పరికరాలు నుదిటి నుండి కొద్ది దూరంలో ఉంటాయి. అవి చర్మాన్ని ఎప్పుడూ తాకనందున, అవి సూక్ష్మక్రిములను ప్రసారం చేయకుండా నిరోధించడంలో సహాయపడతాయి, ప్రతి ఉపయోగం తర్వాత క్రిమిరహితం చేయవలసిన అవసరం లేదని తేల్చింది.

English summary
coronavirus can last 9 hours on skin: Breathing with face mask does not alter oxygen level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X