coronavirus: 9కి చేరిన కరోనా మృతుల సంఖ్య, హిమాచల్ ప్రదేశ్‌లో వృద్దుడి మృతి...

కరోనా పాజిటివ్‌తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి ఎనిమిది మంది చనిపోగా.. హిమాచల్ ప్రదేశ్‌లో మరొకరు చనిపోయారు. 69 ఏళ్ల వృద్దుడు వైరస్ సోకి చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. దీంతో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకున్నది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం 10కి చేరుకుంది రిపోర్ట్ చేస్తున్నాయి.

 9 మంది మృతి..

9 మంది మృతి..

ఆదివారం ఏడు మంది మృతిచెందగా.. సోమవారం ఇద్దరు చనిపోవడంతో 9కి చేరింది. హిమాచల్ ప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయన ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడని వైద్యులు పేర్కొన్నారు. ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోన్న సంగతి తెలిసిందే.

కోల్ కతాలో ఒకరు

కోల్ కతాలో ఒకరు

కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఇది బెంగాల్‌లో మొదటి కరోనా మరణం అని అధికారులు పేర్కొన్నారు. ఇటలీ నుంచి కుటుంబంతో సహా కోల్‌కతా రాగా.. అతని కుమారుడు మాత్రం బాగనే ఉన్నారు. యూపీకి చెందని ఓ వైద్యుడు ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని వైద్యులు పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

 నిన్న పాట్నాలో

నిన్న పాట్నాలో

పాట్నాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఖతార్ నుంచి వచ్చారు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం పాట్నాలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటు చనిపోయారు. మృతిచెందాక కూడా అతని రక్త నమూనాలు సేకరించిన వైద్యులు.. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. దీంతో దేశంలో వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య ఆరుకి చేరింది. తర్వాత మరొకరు కూడా ఆదివారం చనిపోయారు.

పెరిగే అవకాశం

పెరిగే అవకాశం

కర్ణాటక, ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లో ఒక్కొక్కరు కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. జైపూర్‌లో ఇటలీ పర్యాటకుడు మృతిచెందారు. ఇటలీ టూరిస్ట్ మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది. నిన్న పుణెలో ఒకరు చనిపోవడంతో అది ఆరుకి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+