• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Corona Lockdown: మాస్క్ లేదని సచిన్ కు ఇలాంటి శిక్షా ?, కోబ్రా అయితే ఏంది తొక్క, పైత్యం !

|

బెంగళూరు/ బెళగావి: కరోనా వైరస్ (COVID 19) నియమ నిబంధనలు, లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించాడని ఆరోపిస్తూ CRPF Cbra Jawan పై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు. కరోనా వైరస్ కట్టడి కోసం తాము ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నామని, నువ్వు కనీసం మాస్క్ కూడా వేసుకోలేవా ? అంటూ ఆ సీఆర్ పీఎఫ్ జవాన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతని చేతులకు సంకెళ్లు వేసి కట్టేయడంతో వివాదానికి దారితీసింది. సీఆర్ పీఎఫ్ జవాన్ ను సంకెళ్లతో కట్టేసిన వీడియో వైరల్ కావడంతో ఓ మంత్రి తాను మరో ఇద్దరు మంత్రులతో మాట్లాడానని, త్వరలో ఓ చక్కటి పరిష్కారం చిక్కుతుందని సోషల్ మీడియాలో సింపుల్ గా ఓ ట్వీట్ చేశారు. సీఎఆర్ పీఎఫ్ జవాన్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కొందరు పోలీసులపై మండిపడిన సీఆర్ పీఎఫ్ ఏడీజీ వెంటనే విచారణ జరిపించాలని డీజీపీకి లేఖ రాశారు.

Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !

ఇంటి ముందు బైక్ వాటర్ వాష్

ఇంటి ముందు బైక్ వాటర్ వాష్

కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడి తాలుకా ఎక్సాంబ ప్రాంతంలో సచిన్ సావంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సీఆర్ పీఎఫ్ లో కోబ్రా కమాండోగా సచిన్ సావంత్ ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ సందర్బంగా ఇంటి దగ్గరే ఉన్న సచిన్ సావంత్ ఇంటి ముందు అతని బైక్ ను నీటితో శుభ్రం చేస్తున్నాడు.

పోలీసులు VS సీఆర్ పీఎఫ్ జవాన్

పోలీసులు VS సీఆర్ పీఎఫ్ జవాన్

కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ప్రజలు ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడటానికి స్థానిక పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఇంటి ముందు బైక్ శుభ్రం చేస్తున్న సచిన్ సావంత్ పోలీసుల కళ్లలో పడ్డాడు. సచిన్ సావంత్ ఇంటి దగ్గరకు వెళ్లిన పోలీసులు నువ్వు ముఖానికి ఎందుకు మాస్క్ పెట్టుకోలేదని అతనితో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో సచిన్ సావంత్, పోలీసుల మద్య మాటామాటా పెరిగిపోయింది.

నువ్వు కోబ్రా కమాండో అయితే ఏందిరా తొక్కా !

నువ్వు కోబ్రా కమాండో అయితే ఏందిరా తొక్కా !

తాను సీఆర్ పీఎఫ్ లో కోబ్రా కమాండోగా ఉద్యోగం చేస్తున్నానని, తనకు కరోనా లాక్ డౌన్ నియమాలు తెలుసని, తాను ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని, ఇక్కడే బైక్ శుభ్రం చేస్తున్నానని సచిన్ సావంత్ పోలీసులతో వాదించాడు. నువ్వు సీఆర్ పీఎఫ్ జవాన్ అయితే ఏంది, కోబ్రా కమాండో అయితే ఏందిరా తొక్కా, పదరా ముందు పోలీస్ స్టేషన్ కు అంటూ సచిన్ సావంత్ ను లాక్కెళ్లిపోయారు.

దొంగను కట్టేసినట్లు గొలుసులతో కట్టేశారు

దొంగను కట్టేసినట్లు గొలుసులతో కట్టేశారు

సీఆర్ పీఎఫ్ జవాన్ సచిన్ సావంత్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తరువాత దొంగలను కట్టేసినట్లు అతని చేతికి సంకెళ్లు వేసి తాళం వేశారు. సచిన్ సావంత్ చేతులకు సంకెళ్లు వేసి తాళం వేసిన వీడియో, ఫోటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఆర్ పీఎఫ్ జవాన్ తో పోలీసులు ఇలాగేనా ప్రవర్తించేది అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

మంత్రిగారి సింపుల్ స్వీట్ ట్విట్

విషయం తెలుసుకున్న కర్ణాటక మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీటీ. రవి సీఆర్ పీఎఫ్ జవాన్ సచిన్ సావంత్ చేతులకు సంకెళ్లు వేశారని తెలిసింది. ఇది చాలా విచారకరమైన సంఘటన, తాను సీనియర్ మంత్రులు జగదీష్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో మాట్లాడాను, దీనికి త్వరలో చక్కటి పరిష్కారం చిక్కుతుందని ఓ ట్విట్ చేశారు. మంత్రి సీటీ. రవి తాను వేరే మంత్రులతో మాట్లాడాను అని చెప్పడం కంటే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సీఆర్ పీఎఫ్ జవాన్ ను విడిపించ వచ్చు కదా ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  Bill Gates Defends China, Blames American Government
  ఏం జరిగిందో చెప్పండి

  ఏం జరిగిందో చెప్పండి

  సీఆర్ పీఎఫ్ కోబ్రా కమాండో సచిన్ సావంత్ కు పోలీసులు సంకెళ్లు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఆర్ పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కర్ణాటక డీజీపీకి లేఖ రాశారు. అసలు ఏం జరిగిందో విచారణ జరిపి మాకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మొత్తం మీద బెళగావి పోలీసుల ఓవర్ యాక్షన్ తో సీఆర్ పీఎఫ్ జవాన్ కు సంకెళ్లు పడ్డాయని నెటిజన్లు మండిపడుతున్నారు.

  English summary
  Coronavirus Lockdown: Central Reserve Police Force (CRPF) Additional Director General has written a letter to DGP Karnataka requesting an inquiry into the incident wherein a commando of the central agency was tied with chains at a police station in Karnataka.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X