• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా:లాక్‌డౌన్ పొడగింపుపై గందరగోళం.. సీఎంలతో ప్రధాని మోదీ కాన్ఫరెన్స్.. అసలేం జరుగుతోంది?

|

కరోనా పుట్టిన వూహాన్‌లో తప్ప ప్రపంచంలోని మరే పెద్ద సిటీలోనూ వైరస్ వ్యాప్తి ఉధృతి తగ్గలేదు. భారత్ లో సోమవారం నాటికి కేసుల సంఖ్య 28వేలు దాటింది. మరణాలు 900కి చేరువయ్యాయి. రికవరీ రేటు గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త ఇన్ఫెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. నెల రోజులకుపైగా కొనసాగుతోన్న లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరింది.

కోట్లాది మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో ప్రభుత్వాలు అండగా ఉంటామన్నప్పటికీ వ్యవస్థల రీఓపెనింగ్ ఒక్కటే పరిష్కారమనే భావన వ్యక్తమవుతోంది. అలాగని వైరస్ తగ్గకుండా లాక్ డౌన్ ఎత్తివేతకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. ఈ సంక్లిష్ట సమయంలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగిన పీఎంతో సీఎంల సమావేశం వివరాలిలా ఉన్నాయి..

లాక్ డౌన్ సక్సెస్

లాక్ డౌన్ సక్సెస్

కాన్ఫరెన్స్ లో ప్రారంభోపన్యాసం సందర్భంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధాని మోదీ అభినందించారు. మహమ్మారిపై పోరాటంలో దేశమంతా ఒక్కటిగా నిలవటం గర్వకారణమని, కరోనాను కట్టడి చేస్తూనే పేదలను ఆదుకునే విషయంలో రాష్ట్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని మెచ్చుకున్నారు. ప్రపంచ దేశాల్లో వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరుతో పోల్చుకుంటే మన దగ్గర లాక్ డౌన్ సక్సెస్ అయినట్లుగానే భావించాలని, అయితే ముప్పు ఇంకా తొలిగిపోనందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగానే ఉండాలన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని ఆదివారం నాటి మన్ కీ బాత్ లోనూ ప్రజలకు వివరించినట్లు గుర్తుచేశారు. కరోనా కట్టడి చర్యల్లో కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందన్న ప్రధాని.. లాక్ డౌన్ ఎగ్జిట్ స్ట్రాటజీపై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.

భిన్నవాదనలు..

భిన్నవాదనలు..

కరోనా వ్యాప్తి భయాలకంటే లాక్ డౌన్ పొడగింపు అంశమే చర్చనీయంగా మారిన వేళ.. ప్రధానితో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు లాక్ డౌన్ పొడగించాలని కోరితే, ఇంకొందరు రిలాక్సేషన్లు కావాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో, నిర్ణయాన్ని కేంద్రానికే వదిలేస్తున్నామని చెప్పారు. తొలుత చిన్నరాష్ట్రాల సీఎంలో, ఆ తర్వాత పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రిపోర్టును ప్రధాని ముందుంచారు. విచిత్రంగా బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచే లాక్ డౌన్ తొలగింపు డిమాండ్ వ్యక్తం కావడం గమనార్హం.

పోలియో నియంత్రణ తరహాలో..

పోలియో నియంత్రణ తరహాలో..

దేశంలో పోలియో నియంత్రణ కోసం అనుసరించిన విధానాలనే కరోనా కట్టడి కోసం అమలు చేద్దామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించారు. వైద్య బృందాలను ఇంటింటికీ పంపి, అందరికీ వేగంగా టెస్టులు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలన్నారు. లాక్ డౌన్ ఎత్తివేత విషయంలో ఎవరికివాళ్లు కాకుండా, సమగ్ర జాతీయ విధానాన్ని అనుసరించడం మంచిదని, తద్వా ఎకానమీని కాపాడుకోవచ్చని, ఇందు కోసం నీతిఆయోగ్ ప్రణాలికలు రూపొందించాలని, పబ్లిక్ గ్యాదరింగ్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకుండా, ఎకానమీ ముందుకు నడిచేలా ఉపాయాలను ఆలోచించాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు.

కేంద్రం జోక్యం వద్దు..

కేంద్రం జోక్యం వద్దు..

కరోనాపై పోరులో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు మళ్లీ కేంద్రం అనుమతి తీసుకోవాల్సి రావడం బాగోలేదని పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆక్షేపించారు. తమ రాష్ట్రంలో పీపీఈ కిట్స్, ఇతర వైద్య పరికరాల కొనుగోలు నిర్ణయాలను స్థానిక ప్రభుత్వాలకే వదిలేయాలని, ఎమర్జెన్సీ అవసరాల విషయంలో కేంద్రం జోక్యం వద్దని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య తాత్కాలిక రవాణా పునరుద్ధరణ ఇప్పుడే వద్దని, వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాతే ఆ పని చేద్దామన్నారు. మేఘాలయ సీఎం కొరాడ్ సగ్మా మాత్రం.. తమ రాష్ట్రంలో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలనుకున్నట్లు తెలిపారు.

పెద్ద రాష్ట్రాల సీఎంలు ఇలా..

పెద్ద రాష్ట్రాల సీఎంలు ఇలా..

తొలుత చిన్న రాష్ట్రలు, కరోనా కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశాయి. ఆ తర్వాత పెద్ద రాష్ట్రాలు, కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలో తమ వాదనను రాతపూర్వకంగా పంపారు. కేవలం తొమ్మిది మంది సీఎంలు మాత్రమే మాట్లాడుతారని, మిగతా రాష్ట్రాలు రాతపూర్వక నివేదికలుస్తాయని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన చేసింది. కరోనా కేసుల్లో టాప్ లో ఉన్న మహారాష్ట్ర.. లాక్ డౌన్ పొడగింపునకు పూర్తిగా మద్దతు పలకలేదు, దశలవారీ ఎత్తివేతకు మొగ్గుచూపింది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఇదే కోరారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా మరిన్ని సడలింపులు కోనినట్లు సమాచారం.

మోదీ భరోసా..

మోదీ భరోసా..

ప్రధని మోదీతో కాన్ఫరెన్స్ లో నాలుగు రాష్ట్రాల సీఎంలు మాత్రమే లాక్ డౌన్ పొడగించాలని కచ్చితంగా డిమాండ్ చేయగా, మిగతావాళ్లంతా రిలాక్సేషన్లు కోరినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. రెడ్ జోన్లలో ఆంక్షలు కొనసాగిస్తూ, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఇంకొన్ని మినహాయిపులు ప్రకటించాలని సీఎంలు సూచించినట్లు తెలిసింది. కాన్ఫరెన్స్ ముగింపు సందర్బంగా ప్రధాని మరోసారి మాట్లాడుతూ.. కేసుల సంఖ్య పెరుగుతున్నందుకు రాష్ట్రాలు డిప్రెస్ కావాల్సిన అవసరం లేదని, నిజానికి కలిసికట్టుగా పోరాడటం వల్లే పరిస్థితిని ఈమాత్రమైనా అదుపులో ఉంచగలిగామన్నారు.

  Lockdown : PM Modi Video Conference With CMs On COVID-19 & Lockdown
  చివరికి ఏం తేలిందంటే..

  చివరికి ఏం తేలిందంటే..

  లాక్ డౌన్ దశలవారీగా ఎత్తేయాలని మెజార్టీ సీఎంలు అభిప్రాయపడగా, కొందరేమో దాన్ని కొనసాగించాలని కోరారు. ప్రధాని మోదీ కూడా మెజార్టీ సీఎంల అభిప్రాయంవైపే మొగ్గుచూపుతూ, ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సిందేనని అన్నారు. అయితే, రీఓపెనింగ్ విషయంలో తొంరపాటు పనికిరాదని, సోషల్ డిస్టెన్స్, టెస్టింగ్స్, ట్రీట్మెంట్ తదితర అంశాలను పక్కాగా బేరీజు వేసుకున్న తర్వాతే ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలకు అనుమతించే అవకాశాలను పరిశీలించాలని సీఎంలకు సూచించారు. లాక్ డౌన్ గడువు ఈ ఆదివారంతో ముగియనుండటంతో ఆలోపు ఇంకొందరు ముఖ్యులతో, ఎకనమిస్టులతో చర్చించి, ప్రధాని మోదీ తుది నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఊహాగాలను నమ్మరాదని ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి.

  English summary
  Prime Minister Narendra Modi on Monday held a meeting of chief ministers to discuss the Covid-19 situation and Graded lockdown Exit Strategy in the country.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X