వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సి క్లోరోక్విన్ ఇవ్వొద్దు, సైడ్ ఎఫెక్ట్స్: కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రోగులు, బంధువులు హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ధృవీకరించింది. అయితే వైరస్ హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడటం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం స్పష్టంచేసింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ వాడితే సంబంధిత వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెచ్చరించింది. హైడ్రాక్సి క్లోరోక్విన్ కావాల్సిన వారికి మెడికల్ షాపు వారు ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే ఇవ్వాలని.. మౌఖికంగా అడిగితే ఇవ్వొద్దని తేల్చిచెప్పింది.

coronavirus: Dont use hydroxychloroquine without prescription: Govt

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd

కరోనా వైరస్‌కు చికిత్స అందిస్తోన్న వైద్యులు, సిబ్బంది మాత్రమే హైడ్రాక్సి క్లోరోక్విన్ ఉపయోగించొచ్చని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మిగతావారు వాడితే దుష్ర్పభావాలు చూపుతాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. హైడ్రాక్సి క్లోరోక్విన్ గురించి తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. కరోనా వైరస్ నివారణ కోసం వాడొచ్చని పేర్కొన్నారు. తర్వాత ఫ్రాన్స్, చైనా కూడా అధ్యయనవ చేసి.. రోగులు కూడా వాడొచ్చని తెలిపింది. దీంతో హైడ్రాక్సి క్లోరోక్విన్ పేరు ప్రజలకు తెలిసింది. దీనిపై భారత వైద్య పరిశోధన మండలి కూడా తొలుత అంగీకరించగా.. బుధవారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి సైడ్ అఫెక్ట్స్ ఉంటాయని వాడొచ్చని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
While coronavirus panic spreads across the country, the Union Health Ministry has one strict advice do not take hydroxychloroquine without prescription.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X