coronavirus: కరాళ నృత్యం, 250కి చేరిన పాజిటివ్ కేసులు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో పాజిటివ్
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి వరకు 250 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజు 40 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల్లో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సోమవారం నుంచి రోజు 20 టెస్టులు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంటామని చెప్పారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు మూసివేయాలని సీఎంలు ప్రధాని మోడీని కోరారు. ముంబై, పుణెలో కార్యాలయాలను మార్చి 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో మాల్స్ మూసివేస్తున్నామని.. నిత్యవసర సరుకులు అందజేసే మాల్స్ మాత్రమే తెరచి ఉంటాయని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ షాపులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని వివరించారు.

శనివారం రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్, రవాణాను మూసివేస్తున్నామని మేఘాలయ ప్రభుత్వం పేర్కొన్నది. శుక్రవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సీఎం కే సంగ్మా పేర్కొన్నారు. కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకే చర్యలు చేపట్టినట్టు వివరించారు. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. జబదల్ పూర్‌లో ఇటీవల దుబాయ్ నుంచి తిరిగివచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని షాపూర్ వద్ద ఇద్దరికీ కరోనా పాజిటివ్ వైరస్ సోకింది.
రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్న నేపథ్యంలో రైలు, విమాన సర్వీసులను నిలపివేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికే బయల్దేరిన రైళ్లు మాత్రం తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications