కొవిడ్-19 రోగం కాదు.. దేవుడి శాపం.. సామూహిక ప్రార్థనలతోనే తగ్గుముఖం: ఎంపీ రెహ్మాన్ విచిత్రం

కరోనా వైరస్ కు విరుగుడు మందు కోసం దేశదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరణాల రేటు తక్కువే అయినప్పటికీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటం, కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనలకు గురిచేస్తున్నది. అదే సమయంలో ఈ వ్యాధిపై చిత్రవిచిత్ర వ్యాఖ్యానాలు చేస్తున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఇప్పుడా జాబితాలోకి బాధ్యతగల ఓ గౌరవనీయ ఎంపీ గారు కూడా చేరిపోయారు.

కరోనా విపత్కర సమయంలో భౌతిక దూరాన్ని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, మాస్కులు ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వాలు, డాక్టర్లు, సైంటిస్టులు చెబుతుండగా, సామూహిక ప్రార్థనల ద్వారా మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలమని సెలవిచ్చారు సమాజన్ వాదీ పార్టీకి చెందిన ఎంపీ షఫికుర్ రెహ్మాన్ బార్క్. మధ్యప్రదేశ్ లోని సంబల్ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన కొద్ది గంటల కిందట చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

Coronavirus is a Punishment of God, it ends only by Prayers: MP Shafiqur Rahman Barq

కరోనా వైరస్ రోగం కానేకాదని, మనుషులు చేసిన పాపాలకు దేవుడు విధించిన శాపమని ఎంపీ రెహ్మాన్ సెలవిచ్చారు. వైరస్ కట్టడికి ఇప్పటిదాకా మందు కనిపెట్టలేకపోయారని, కాబట్టి సామూహిక ప్రార్థనల ద్వారా దేవుణ్ని ప్రార్థిస్తేనే కరోనా అంతమవుతుందని ఆయన చెప్పారు. అందు కోసం దేశవ్యాప్తంగా మసీదులు, ఈద్గాలు, దర్గాలను వెంటనే రీఓపెన్ చేయాలని ఆయన కోరారు.

Coronavirus is a Punishment of God, it ends only by Prayers: MP Shafiqur Rahman Barq

త్వరలోనే బక్రీద్ పండుగ రాబోతున్న నేపథ్యంలో మసీదులు తెరవాలని, ప్రార్ధనలు చేసుకునేందుకు వెసులుబాటు ఇవ్వాలని, అలాగే గొర్రెలు, మేకలు అమ్మే మార్కెట్లు అందుబాటులో ఉంచాలని రెహ్మాన్ సూచించారు. అయితే, ఎంపీగారి వ్యాఖ్యలపై ముస్లిం మత పెద్దలు, ముస్లిం యువత సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ చాదస్తానికి మతాన్ని వాడుకోరాదంటూ నెటిజన్లు హితవు పలికారు.

Recommended Video

    #N95Mask : N95 మాస్క్‌లతో జాగ్రత్త.. హానికరం అంటున్న కేంద్రం! || Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+