Corona Lockdown:బెంగళూరు ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 20 నుంచి ఓకే, అయితే ?
బెంగళూరు: భారతదేశం ఐటీ రాజధాని బెంగళూరు లో లాక్ డౌన్ కారణంగా చాలావరకు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కర్ణాటక ఐటీ, బీటీ పరిశ్రమల శాఖా మంత్రి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 20 నుండి, ఆంక్షలు మరియు నిబంధనలను అనుసరించి ఐటి పరిశ్రమలు ప్రారంభించడానికి అవకాశం ఇచ్చే విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటున్నామని డీసీఎం డాక్టర్ అశ్వథ్ నారాయణ అన్నారు. అయితే ప్రతి కంపెనీ ఆ సంస్థకు చెందిన 50 శాతం మంది ఉద్యోగులతోనే కార్యాలయాల్లో పని చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం షరతులు పెడుతోంది.

ఐటీ కంపెనీలపై కరోనా ప్రభావం
కరోనా వైరస్ ప్రభావం ఐటీ కంపెనీలతో పాటు అన్ని పరిశ్రమల మీద పడింది. కొన్ని కంపెనీలు ప్రభుత్వ ప్రాజెక్టులకు సాంకేతిక సహాయం అందించాయి. చాలా వరకు ఐటి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకున్నాయి. ఇలా చాలా ఐటీ కంపెనీలు విజయవంతం అయ్యాయి. బెంగళూరు ఐటి రంగం సమర్థవంతంగా పనిచేస్తోందని ఇప్పుడు మరోసారి ప్రపంచం అంతా గుర్తించింది.

ఐటీ కంపెనీల యాజమాన్యం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఐటీ బీటీ శాఖల మంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ శుక్రవారం బెంగళూరు నగరంలోని ఎంఎస్, బిల్డింగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీ, బీటీ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడారు. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ విస్తరించిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ?, మీ అభిప్రాయాలు ఏమిటి ?. మీ కంపెనీల కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి అనుకుంటున్నారు ?, కంపెనీలలో సమదూరం ఎలా పాటిస్తారు ? అంటూ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ ఆ కంపెనీల యాజమాన్యం, ప్రతినిధిలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ నియమాలు ఇవే !
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా ప్రతి ఒక్కరూ సమదూరం పాటించాలని మంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ గుర్తు చేశారు. ప్రభుత్వ వాహనాలు లేని సమయంలో అందరూ ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తారని గుర్తు చేశారు. బెంగళూరు సిటీలో ప్రస్తుతానికి బీఎంటీసీ బస్సులు (ప్రభుత్వ సిటీ బస్సులు), మెట్రో రైలు సంచరించవని మంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ గుర్తు చేశారు. బస్సుల్లో ఐతే 20 మంది మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉందని, ఐటీ కంపెనీ ఉద్యోగులు బైక్ ల్లో ఒక్కొక్కరు, కార్లలో ఇద్దరు మాత్రమే ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందని, అందుకు ప్రభుత్వం రూట్ మ్యాప్, ఇ-పాస్ జారీ చేస్తోందని మంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ వివరించారు.

50 శాతం ఉద్యోగులు మాత్రమే !
ఐటీ కంపెనీలు కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయిస్తే కరోనా లాక్ డౌన్ నియమాలను పాటించి ఆ కంపెనీ ఉద్యోగులు 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరు అయ్యేలా ఆ కంపెనీల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సూచిస్తోంది. అయితే అత్యవసర సేవలతో పాటు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కంపెనీల ఉద్యోగులు కచ్చితంగా ఇ పాస్ లు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది.
Recommended Video

రెడ్ జోన్ లో ఎలాంటి మార్పు లేదు
మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ అర్దరాత్రి వరకు లాక్ డౌన్ అమలు చేశారు. తరువాత ఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు మరో 19 రోజులు కరోనా లాక్ డౌన్ అమలు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్లలో ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం లేదని, అందులో ఎలాంటి మార్పు లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications