బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Corona Lockdown: ఆంధ్రాలో విదేశీయులు, బెంగళూరు నుంచి జపాన్ కు పంపించండి, కేంద్రం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు భారతదేశంలో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారిని అంతం చెయ్యడానికి లాక్ డౌన్ ఒక్కటే రామబాణం అని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పారు. నేటితో లాక్ డౌన్ మొదటి విడత పూర్తి కావడంతో మే 3వ తేదీ వరకు రెండో విడత లాక్ డౌన్ పొడగిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. ఈ సందర్బంగా భారతదేశానికి వచ్చి లాక్ డౌన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులను వారి స్వదేశానికి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరు నుంచి తమ దేశం వారిని తీసుకెళ్లడానికి జపాన్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

 జపాన్ టూ భారత్

జపాన్ టూ భారత్

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న సమయంలోనే జపాన్ కు చెందిన కొందరు విదేశీయులు భారత్ వచ్చారు. కరోనా వైరస్ రోజురోజుకు విస్తరించడంతో భారతదేశంలో మార్చి 24వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో లాక్

ఆంధ్రప్రదేశ్ లో లాక్

దేశం మొత్తం లాక్ డౌన్ అమలులోకి రావడంతో అప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలో జపాన్ దేశానికి చెందిన ఆరు మంది ఉన్నారు. లాక్ డౌన్ అమలులోకి రావడంతో రోడ్డు మార్గం, రైలు మార్గం, విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో విశాఖపట్టణంలో ఉన్న జపాన్ వాసులు షాక్ కు గురైనారు.

 అయ్యా, మమ్మల్ని జపాన్ పంపించండి

అయ్యా, మమ్మల్ని జపాన్ పంపించండి

లాక్ డౌన్ కు ముందే తాము భారత్ వచ్చామని, ఇప్పుడు ఎటూ వెళ్లలేక విశాఖపట్టణంలో చిక్కుకుపోయామని, మా దేశం జపాన్ కు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని ఆ దేశానికి చెందిన ఆరు మంది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. జపాన్ ప్రజల మనవిని కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిశీలించింది.

జపాన్ ప్రజలకు కరోనా పరీక్షలు

జపాన్ ప్రజలకు కరోనా పరీక్షలు

విశాఖపట్టణంలో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. జపాన్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. జపాన్ వాసులు వారి స్వదేశానికి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతితో జపాన్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

 బెంగళూరు టూ జపాన్

బెంగళూరు టూ జపాన్

మంగళవారం బెంగళూరు నుంచి జపాన్ వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వారిని ప్రత్యేక విమానంలో బెంగళూకు పంపించామని విశాఖపట్టణం ఎయిర్ పోర్టు సీనియర్ అధికారి రాజ్ కిశోర్ తెలిపారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి (కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం) జపాన్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక విమానం చేరుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆరు మంది జపాన్ వెళ్లడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

English summary
Coronavirus Lockdown: Japanese Returned To Hometown From Bengaluru International Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X