బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: బెంగళూరులో అల్లర్లు, 186 మంది పోలీసులు క్వారంటైన్ లో, తబ్లీగి జమాత్ దెబ్బతో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటి బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి సోకిన రోగులను పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, ఆశా వర్కర్లపై దాడులు చేసిన వారిని అరెస్టు చేశారు. పాదరాయనపురలో 119 మందిని అరెస్టు చెయ్యడానికి వెళ్లిన 186 మంది పోలీసులు నేడు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అరెస్టు అయిన వారిలో ఇప్పటికే 5 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆపరేషన్ పాదరాయనపురలో పాల్గొన్న 186 మంది పోలీసులు ఇప్పుడు క్వారంటైన్ లో ఉన్నారు. 186 మంది పోలీసుల కుటుంబ సభ్యులను ముందు జాగ్రతగా హోమ్ క్వారంటైన్ లో పెట్టి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ తబ్లీగి జమాత్ దెబ్బతోనే బెంగళూరులోని పాదరాయనపురలో కరోనా వ్యాపించిందని వెలుగు చూసింది. అల్లరిమూకలను అరెస్టు చెయ్యడానికి వెళ్లిన పోలీసుకు పాపం ఎలాంటి పరిస్థతి వచ్చిందో చూడండి అంటూ ప్రజలు జాలి చూపిస్తున్నారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

రాత్రి రచ్చరచ్చ చేసిన కరోనా పేషంట్స్

రాత్రి రచ్చరచ్చ చేసిన కరోనా పేషంట్స్

బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడంతో ఆ ప్రాంతాన్ని 10 రోజుల క్రితమే సీల్ డౌన్ చేశారు. ఆదివారం రాత్రి కరోనా వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలనే ఉద్దేశంతో వైద్య సిబ్బంది, పోలీసులు, ఆశా వర్కర్లు పాదరాయనపురకు వెళ్లారు. ఆ సమయంలో స్థానిక అల్లరిమూకలు, కరోనా వ్యాధి సోకిన వారు, వారి బంధువులు పోలీసులు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది మీద దాడులు చేసి అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు ధ్వంసం చేసి నానా రచ్చ చేశారు.

బెంగళూరులో తబ్లీగి జమాత్ సభ్యులు మకాం !

బెంగళూరులో తబ్లీగి జమాత్ సభ్యులు మకాం !

పాదరాయనపురలోని మసీదులో విదేశాలకు చెందిన తబ్లీగి జమాత్ సభ్యులు ఉన్నారు. ఎక్కడ విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులను అరెస్టు చేస్తారో ? అనే భయంతో స్థానిక అల్లరిమూకలు ప్రభుత్వ సిబ్బందిపై దాడులు చేశారు. ఆ సమయంలో పోలీసులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు సహనంతో ఓర్చుకున్నారు.

119 మందిలో 5 మందికి కరోనా పాజిటివ్

119 మందిలో 5 మందికి కరోనా పాజిటివ్

పాదరాయనపురలో వైద్య సిబ్బందిపై దాడులు చేసిన 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఐదు మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఇప్పటికే పాదరాయనపురలో ఎక్కువగా కరోనా వైరస్ కేసులు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేసిన వైద్య సిబ్బందితో పాటు ఆప్రాంతాలకు వెళ్లిన పోలీసులు హడలిపోయారు.

క్వారంటైన్ లో 186 మంది పోలీసులు, ఫ్యామిలీలు

క్వారంటైన్ లో 186 మంది పోలీసులు, ఫ్యామిలీలు

పాదరాయనపురలో అల్లరిమూకలను అరెస్టు చేసిన బెంగళూరు సెంట్రల్, పశ్చిమ విభాగం పోలీసులు ఇప్పుడు కరోనా భయంతో హడలిపోతున్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో 5 మందికి కరోనా పాజిటివ్ రావడం, వారిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లిన మొత్తం 186 మంది పోలీసులు నేడు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా వైద్య పరీక్షలు చేసిన అధికారులు వారిని హోమ్ క్వారంటైన్ కు తరలించారు.

పోలీసులు అంటే ఇంత నిర్లక్షమా ?

పోలీసులు అంటే ఇంత నిర్లక్షమా ?

పాదరాయనపురలో అల్లరిమూకలను అరెస్టు చేసి నేడు క్వారంటైన్ లో ఉంటున్న పోలీసులు పై అధికారులు, వైద్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులను అరెస్టు చెయ్యడానికి వెళ్లిన మాకు కేవలం సానిటైజర్, మాస్కులు, గ్లోజ్ లు ఇచ్చి పంపించారని, పీపీఇ కిట్లతో శిక్షణ పొందిన సిబ్బందిని అక్కడికి పంపించలేదని, ఇప్పుడు మాకు జరగరానిది ఎదైనా జరిగితే మా కుటుంబాలకు దిక్కెవరు ? అంటూ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు సీనియర్ పోలీసు అధికారులు సైతం మా గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోలేదని కొందరు పోలీసులు అసహనం వ్యక్తం చేశారని కన్నడ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Watch Flights Parking at Delhi's Airport, Rare Video Must Watch
నిందితుల విచారణ

నిందితుల విచారణ

పాదరాయనపురలో అరెస్టు చేసిన అల్లరిమూకలను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేస్తున్నారు. పాదరాయనపురలో విదేశాలకు చెందిన 19 మంది తబ్లీగి జమాత్ సభ్యులకు ఆశ్రయం ఇచ్చారని, వారు చిక్కిపోతారనే భయంతోనే స్థానికులు పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడులు చేశారని ఇప్పటికే కేసులు నమోదైనాయి. బెంగళూరు నగరంలోని పాదరాయనపురలో అరెస్టు చేసిన నిందితులను బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి తరలించి విచారణ చేశారు. అనంతరం నిందితులను ఆడుగోడిలోని మంగళ కల్యాణమండపంలోని కరోనా క్వారంటైన్ కు తరలించారు.

English summary
Coronavirus Lockdown: 186 Police who involved in arresting 119 accused are sent for Home quarantine in Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X