వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: మేడమ్ మసీదులో ఏం జరిగింది ?, నివేదిక కోరిన ప్రభుత్వం, తబ్లీగి రిపీట్ కాకుండా, కరోనా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కోలారు: కరోనా వైరస్ ను (COVID 19) అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో గుమికూడి సామూహిక పూజలు, ప్రార్థనలు చెయ్యకూడదని, సమదూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి మసీదులో నమాజ్ చేస్తున్న వారిపై ఓ లేడీ తహసిల్దార్ మండిపడ్డారు. మహిళలకు మసీదులోకి ప్రవేశం లేకున్నా ఆమె నేరుగా మసీదులోకి వెళ్లారు. మీకు మసీదులో ప్రార్థనలు చెయ్యాలని ఎవరు చెప్పారు ? ఎవరు అనుమతి ఇచ్చారు ?, మీ ప్రాణాలతో పాటు సాటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతారా అంటూ లేడీ తహసిల్దార్ విరుచుకుపడ్డారు. మసీదు గేట్లు క్లోజ్ చేయించారు. మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లేడీ తాహసిల్దార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మసీద్ దగ్గర జరిగింది ? అని నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం కోలారు లేడీ తహసిల్దార్ శోభితకు సూచించారని తెలిసింది.

lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!lockdown murder: ఫ్రెండ్ తల్లితో బెడ్ రూంలో రాసలీలలు, అడ్డంగా నరికేసి, మర్మాంగం కత్తిరించి!

వివాదానికి దారితీసిన లేడీ ఎంట్రీ

వివాదానికి దారితీసిన లేడీ ఎంట్రీ

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణంలోని దోడ్డపేట మార్కెట్ లోని Bha-ki Masjidలో సామూహిక నమాజ్ చేస్తున్నారని సమాచారం అందడంతో కోలారు తహసిల్దార్ శోభిత మసీదులోకి నేరుగా వెళ్లారు, ఓ మహిళ మసీదులోకి వెళ్లడంతో కొందరు ముస్లీం పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మహిళగా కాదు అధికారినిగా వెళ్లాను

మహిళగా కాదు అధికారినిగా వెళ్లాను

తాను ఓ మహిళగా మసీదులోకి వెళ్లలేదని, ఓ అధికారినిగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెళ్లానని, ఏ మతాన్ని తాను కించపరచలేదని కోలారు తహసిల్దార్ శోభిత ఇప్పటికే స్పష్టం చేశారు. మసీదులో సామూహిక నమాజ్ చేస్తున్న 11 మందిని అరెస్టు చెయ్యాలని శోభిత సూచించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మేడమ్ మసీదు దగ్గర ఏం జరిగిందో పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తహసిల్దార్ శోభితకు సూచించింది. అదే విదంగా తహసిల్దార్ శోభితతో పాటు కోలారు జిల్లా ఎస్పీని నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం సూచించిందని తెలిసింది.

సిన్సియర్ లేడీ ఆఫీసర్

సిన్సియర్ లేడీ ఆఫీసర్

కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణంలో శోభిత అనే యువతి తహసిల్దార్ గా పని చేస్తున్నారు. ఎప్పుడూ పేద ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుండే లేడీ తహసిల్దార్ సిన్సియర్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే తహసిల్దార్ శోభిత తనకంటే తక్కువ స్థాయి ఉద్యోగులను ఎంతో గౌరవిస్తారని ఆమెతో కలిసి పని చేస్తున్న ఉద్యోగులు అంటుంటారు.

లాక్ డౌన్ నియమాలు

లాక్ డౌన్ నియమాలు

కరోనా వైరస్ ను అరికట్టడానికి భారతదేశం మొత్తం రెండో విడత లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ నియమాల ప్రకారం ఆలయాలు, మసీదులు, చర్చిలు, దర్గాల్లో సామూహిక ప్రార్థనలు, పూజలు చెయ్యకూడదని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

లాక్ డౌన్ లెక్కలేదు, మసీదులోకి నో ఎంట్రీ !

లాక్ డౌన్ లెక్కలేదు, మసీదులోకి నో ఎంట్రీ !

కోలారు పట్టణంలోని దోడ్డపేట్ మార్క్ లోని మునిసిపల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మసీదులో శుక్రవారం కొంత మంది నమాజ్ చేస్తున్నారని, వారు లాక్ డౌన్ నియమాలు పాటించడం లేదని స్థానికులు తహసిల్దార్ శోభితకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న లేడడీ తహసిల్దార్ శోభిత తన సిబ్బందితో కలిసి మునిసిపల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మసీదు దగ్గరకు వెళ్లారు. తహసిల్దార్ శోభిత మసీదు దగ్గరకు వెళ్లిన సమయంలో లోపలికి మహిళలకు ప్రవేశం లేదని కొందరు ఆమెను అడ్డుకున్నారని తెలిసింది. అయితే లేడీ తహసిల్దార్ నేరుగా మసీదు ఆవరణంలోకి వెళ్లారు. మసీదు గేట్లు మూతపడ్డాయి. ఆ సమయంలో అక్కడ కొంత మంది నమాజ్ చేస్తున్న విషయం గుర్తించిన తహసిల్దార్ శోభిత వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవ్వరినీ వదలద్దు !

ఎవ్వరినీ వదలద్దు !

మసీదులో సుమారు 11 మందికి పైగా నమాజ్ చేస్తున్న విషయం గుర్తించిన తహసిల్దార్ శోభిత మీకు ఇక్కడ నమాజ్ చెయ్యాలని ఎవరు చెప్పారు ? ఎవరు అనుమతి ఇచ్చారు ?, లాక్ డౌన్ నియమాలు ఎందుకు ఉల్లంఘించారు ? అని అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు. మసీదులో ఉన్న వారిని ఇక్కడే అదుపులోకి తీసుకోవాలని, లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు లేడీ తహసిల్దార్ శోభిత సూచించారు.

వీడియోలు వైరల్

వీడియోలు వైరల్

ప్రతినిత్యం మునిసిపల్ ఆసుపత్రి దగ్గర, మసీదు పరిసర ప్రాంతాల్లో లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారని, ఎక్కడ కరోనా వైరస్ వ్యాపిస్తుందో అనే భయంగా ఉందని స్థానికులు ఆరోపించారు. లేడీ తహసిల్దార్ ధైర్యంగా మసీదులోకి వెలుతున్న సమయంలో కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

English summary
Coronavirus lockdown: Video kolar (Karnataka) tahsildar shobhitha entered Masjid And Detained 11 people viral in social media,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X