• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాకింగ్ : గేమ్ ఆడుతుండగా దగ్గినందుకు ఊహించని ఘటన.. కరోనా అనుమానంతో దారుణం..

|

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. ఎవరు దగ్గినా,తుమ్మినా పక్కనున్నవారు బెంబేలెత్తిపోతున్నారు. ఒకింత అనుమానంతో వారికి కాస్త దూరంగా జరుగుతున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులు కూడా మినహాయింపు అవట్లేదు. అయితే కరోనా అనుమానితుడన్న కారణంతో దాడులు కూడా జరుగుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నోయిడాలో ఇలాంటి ఘటనే జరుగుతుంది. నలుగురు మిత్రులు కలిసి లూడో(పాచికల ఆట) గేమ్ ఆడుతుండగా.. అందులో ఓ యువకుడు ఉన్నట్టుండి దగ్గాడు. దీంతో పక్కనే ఉన్న మరో మిత్రుడు గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

ఉత్తరప్రదేశ్‌లోని దయానగర్ గ్రామంలో రాత్రి 9గం. ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. జర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో నలుగురు యువకులు లూడో గేమ్ ఆడినట్టు తెలిపారు. ఆ సమయంలో ప్రశాంత్ సింగ్‌(25) దగ్గడంతో అతని స్నేహితులకు అనుమానం వచ్చింది. ప్రశాంత్ కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందించేందుకే ఇలా చేస్తున్నాడని అనుమానించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన గుల్లు(30) అనే యువకుడు ప్రశాంత్‌పై కాల్పులు జరిపాడు.

ఎఫ్ఐఆర్ నమోదు...

ఎఫ్ఐఆర్ నమోదు...

కాల్పులకు ముందు ప్రశాంత్-గుల్లు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తాను కావాలని దగ్గలేదని ప్రశాంత్ చెప్పినా గుల్లు వినిపించుకోలేదన్నారు. ప్రశాంత్ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడన్న ఉద్దేశంతో గుల్లు ఆవేశంలో గన్ తీసి కాల్చినట్టు చెప్పారు. ఘటనపై సమాచారం అందడంతో ప్రశాంత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించామన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు.

దాడులు సరికాదంటున్న పోలీసులు

దాడులు సరికాదంటున్న పోలీసులు

పొడి దగ్గు,జలుబు,జ్వరం కరోనా లక్షణాలు కావడంతో.. ఈ మూడింటిలో ఏదివున్నా ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే ఈ మూడు లక్షణాలు కలిసివున్నవారిలోనే వైరస్ లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అదే సమయంలో లక్షణాలేవీ లేని వ్యక్తుల్లోనూ వైరస్ పాజిటివ్‌గా తేలుతున్న కేసులు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఒకవేళ అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించడమో.. స్థానిక అధికారులకు సమాచారం అందించడమో చేయాలని.. అంతే తప్ప దాడులకు పాల్పడటం సరికాదని పోలీసులు సూచిస్తున్నారు. అన్ని లక్షణాలు వైరస్ లక్షణాలే కాకపోవచ్చునని కూడా చెబుతున్నారు. అయితే ముందు జాగ్రత్తలో భాగంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అందరికీ మంచిదంటున్నారు.

  Fake News Buster : 05 కాణిపాకం గుడి క్వారంటైన్ సెంటరా ? బాంద్రా లో జరిగిన దానికి కారణం ఫేక్ న్యూస్

  English summary
  Coughing in times of coronavirus is bound to invite fearful stares, but when a 25-year-old man in Greater Noida coughed during a ludo game, he was shot and injured by a fellow villager who accused him of "trying to spread the disease", according to police.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X