కరోనా కొత్త వేరియంట్ కలకలం: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం, అడ్వైజరీ జారీ

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరగడం, కేరళ రాష్ట్రంలో కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ సోమవారం అడ్వైజరీ జారీ చేసింది.

రానున్న పండగల సీజన్‌లో కరోనా వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది. ఇన్‌ఫ్లూయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలోనే నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 ఇటీవల కేరళలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. భారత్ సహా 38 దేశాల్లో ఈ కొత్త వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది.

 Coronavirus subvariant JN.1: Centre issues advisory to states after first case reported in Kerala

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. అప్రమత్తంగా ఉంటూ. కొత్త కేసులపై నిఘా ఉంచాలని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని.. వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని సూచించింది.

వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తాజా అడ్వైజరీలో కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సంసిద్ధతలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ చేపడుతోన్న మాక్ డ్రిల్స్‌లో భాగస్వామ్యం కావాలని సూచించింది.

కాగా, కరోనా వైరస్ బారిన పడి దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో ఐదుగురు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కొత్త వేరియంట్ వ్యాప్తితో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో 60 ఏళ్లుపైబడిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అక్కడి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మిగితా రాష్ట్రాలు కూడా కరోనా వ్యాప్తిని పరిశీలిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+