బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: డోర్ టూ డోర్ కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్, ప్రజలు హ్యాపీ, సిలికాన్ సిటీలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ ను (COVID 19) కట్టడి చెయ్యడానికి అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భారత్ లో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ నేటితో పూర్తి కావడంతో మే 3వ తేదీ వరకు మరోసారి రెండో విడత లాక్ డౌన్ అమలు చేస్తున్నామని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని, ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాపించకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంగళూరులో ఇప్పటికే రెండు ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేస్తోంది. బెంగళూరులో ఇంటింటికి కరోనా వైరస్ టెస్టింగ్ మొబైల్ బూత్ సర్వీసులు ప్రారంభిస్తున్నారు. ప్రతి ఇంటికి దగ్గరకు వెళ్లి కరోనా వైరస్ టెస్టింగ్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!

కరోనా కాలంలో !

కరోనా కాలంలో !

ఐటీ, బీటీ సంస్థలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధి కేసులు ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ అయ్యాయి. బెంగళూరులో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ కాకుండా బీబీఎంపీ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

డోర్ టూ డోర్ కరోనా పరీక్షలు

డోర్ టూ డోర్ కరోనా పరీక్షలు

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు వారు అనారోగ్యానికి గురై కరోనా వైరస్ సోకిందని అనుమానం వస్తే ఇక ముందు ఆసుప్రతులకు వెళ్లాల్సిన అవసరం లేదు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న వారు వారి ఇంటి దగ్గరే కరోనా వైరస్ వ్యాధి సోకిందా లేదా అనే విషయం నిర్దారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్

కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్

బెంగళూరు నగరంలో కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్ ను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. మనోజ్ అనే వ్యక్తి ఈ కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్ ను రూపోందించారు. బెంగళూరు నగరంలోని ప్రతి ఇంటి దగ్గరకు ఈ కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్ లో వెళ్లి ఎవరికైనా కరోనా వైరస్ ఉందా ? అంటూ వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.

247 కరోనా కేసులు

247 కరోనా కేసులు

కర్ణాటకలో మొత్తం 247 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధి కేసులు ఎక్కువ అవుతున్నాయని వెలుగు చూడటంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆసుపత్రితో కలిసి మనోజ్ అనే వ్యక్తి తయారు చేసిన కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్ ను ఇంటింటికి తీసుకెళ్లి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రజల కోసం కరోనా బూత్

ప్రజల కోసం కరోనా బూత్

బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెంగళూరులో కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్ ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వం సహకరిస్తే మరన్ని కరోనా టెస్టింగ్ మొబైల్ బూత్ లు మరన్ని తయారు చేస్తామని మనోజ్ అంటున్నారు మొత్తం మీద బెంగళూరు ప్రజలు ఆసుపత్రికి వెళ్లి కరోనా టెస్టింగ్ పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి ఇంటి దగ్గరకే (డోర్ టూ డోర్) వైద్య పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Recommended Video

Lockdown : Railways Extends Suspension Of Passenger Services Till May 3

English summary
Coronavirus testing mobile booth will be introducing in Bengaluru. Karnataka CM B S Yediyurappa will be inaugurating Tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X