దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కొత్త కేసులు, స్వల్పంగా పెరిగిన మరణాలు, రికవరీనే బిగ్ రిలీఫ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు వరుసగా మూడో రోజూ తగ్గాయి. అయితే, కొత్తగా నమోదైన కరోనా కేసులు 4 లక్షలలోపే నమోదైనప్పటికీ.. మరణాలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోసారి కరోనా మరణాలు 4వేలకుపైగానే నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

దేశంలో కొత్తగా 3,11,170 కరోనా కేసులు, 4 వేలకుపైగా మరణాలు

దేశంలో కొత్తగా 3,11,170 కరోనా కేసులు, 4 వేలకుపైగా మరణాలు

గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 3,11,170 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 25 రోజుల్లో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. ఒక్క రోజు వ్యవధిలో 4077 కరోనా మరణాలు సంభవించాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 2,70,284కి చేరాయి.

దేశంలో కొత్త కేసుల కంటే రికవరీలే అధికం

దేశంలో కొత్త కేసుల కంటే రికవరీలే అధికం

కొత్త నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో 3,62,437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2,70,95,335కి చేరింది. దేశంలో పాజిటివిటీ రేటు 16.98 శాతానికి పడిపోయింది. గత నెల రోజుల్లో ఇదే తక్కువ. ఏప్రిల్ 22 తర్వాత మరోసారి 84 శాతానికి మంచింది రికవరీ రేటు. మరణాల రేటు మాత్రం 1.09 శాతంగానే కొనసాగుతోంది.

దేశంలో 36 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు, ప్రధాని సమీక్ష, సూచనలు

దేశంలో 36 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు, ప్రధాని సమీక్ష, సూచనలు

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కరోనా టెస్టులు గణనీయంగా(50 లక్షల నుంచి 1.3 కోట్లకు టెస్టులు) పెరిగాయని, ఆ సంఖ్యను మరింతగా పెంచాలని రాష్ట్రాలకు సూచించారు.

కరోనా కట్టడికి సరైన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా టెస్టులు పెంచాలన్నారు. దేశంలో అవసరమైన అన్ని ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా అవుతోందన్నారు. కరోనా వ్యాక్సిన్లు కూడా కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు చేరుతున్నాయన్నారు. తాగా, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. శనివారం నుంచే సుత్నిక్ వీ వ్యాక్సిన్ దేశంలో పంపిణీ చేయడం జరుగుతోంది. గత 24 గంటల్లో 17.33 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో 36.18 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+