వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీఎంఆర్ సంచలన పరిశోధన : భారత్‌లోని ఆ 2 గబ్బిలం జాతుల్లో కరోనా.. ఏయే రాష్ట్రాల్లో ఉందంటే?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మూలాలు, దాని విరుగుడుకు కావాల్సిన వ్యాక్సిన్‌ తయారీపై ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు,పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ జన్యు క్రమాన్ని కనిపెట్టేందుకు ఎంతోమంది సైంటిస్టులు ల్యాబోరేటరీల్లో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అదే సమయంలో వైరస్ మూలాలను తెలుసుకునేందుకు మెడికల్ అధ్యయనకారులు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అధికారులు సంచలనాత్మక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.

ఆ 2 జాతులు.. ఏ రాష్ట్ర గబ్బిలాల్లో పాజిటివ్...

ఆ 2 జాతులు.. ఏ రాష్ట్ర గబ్బిలాల్లో పాజిటివ్...

భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న గబ్బిలాల గొంతుల్లో నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఇందులో రౌసెట్టస్(Rousettus),టెరోపస్(Pteropus) అనే గబ్బిలం జాతుల నమూనాల్లో కరోనా వైరస్ బయటపడింది. కేరళ,హిమాచల్ ప్రదేశ్,పుదుచ్చేరి,తమిళనాడుల నుంచి సేకరించిన గబ్బిలాల శాంపిల్స్ కరోనా పాజిటివ్‌గా తేలాయి. అదే సమయంలో కర్ణాటక,తెలంగాణ,గుజరాత్,ఒడిశా,పంజాబ్,చంఢీఘడ్ రాష్ట్రాల నుంచి సేకరించిన గబ్బిలాల శాంపిల్స్ నెగటివ్‌గా తేలాయి.

గతంలో నిపా వైరస్ కూడా

గతంలో నిపా వైరస్ కూడా

గబ్బిలాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ నిపుణులు చెబుతున్నారు. ఏయే రాష్ట్రాల్లోనైతే గబ్బిలాల శాంపిల్స్‌లో వైరస్ పాజిటివ్‌గా తేలిందో.. అక్కడి మనుషుల్లో,పెంపుడు జంతువుల్లో యాంటీ బాడీ సర్వేలు తప్పక నిర్వహించాలన్నారు. కేరళ రాష్ట్రం ఎన్నో రకాల గబ్బిలాలకు నిలయంగా ఉందని.. అలాంటిచోట్ల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.గతంలో గబ్బిలాల శాంపిల్స్‌తో నిర్వహించిన రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR) పరీక్షల్లో నిపా వైరస్‌ల ఉనికిని కూడా కనుగొన్నారు. జంతువుల్లో కరోనా వైరస్‌ను గుర్తించడానికి వన్యప్రాణి సంరక్షణ సంస్థ,వెటిరనరీ డిపార్ట్‌మెంట్,పౌల్ట్రీ డిపార్ట్‌మెంట్,హెల్త్ డిపార్ట్‌మెంట్లు కొత్త విధానాలను కనిపెట్టాల్సిన అవసరం ఉందని తాజా ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోంది.

కొనసాగుతున్న పరిశోధనలు

కొనసాగుతున్న పరిశోధనలు

కరోనా వైరస్ మూలాలపై ఇంతవరకు కచ్చితమైన ఆధారాలేవీ దొరకలేదు. చైనాలోని వుహాన్‌లో ఉన్న ఓ సీ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిందన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గబ్బిలాలు,అలుగుల ద్వారా వీటికి వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అదే సమయంలో అనేక కుట్ర కోణాలకు సంబంధించిన థియరీలు కూడా సర్క్యులేషన్‌లో ఉన్నాయి. కుట్ర కోణాల సంగతి పక్కనపెడితే.. సైంటిస్టులు మాత్రం దీని మూలాలు కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ మూలాలను ఎంత త్వరగా కనిపెడితే.. అంత త్వరగా వ్యాక్సిన్ తయారీకి అవకాశం ఉండవచ్చు.

English summary
The presence of coronavirus has been found in two bat species seen in four states including Kerala. A study conducted by Indian Council of Medical Research(ICMR).published on Monday states, bats are known reservoirs for a broad range of coronaviruses and are often transmitted to humans through an intermediate host
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X