Corporate donations:విరాళాల్లో బీజేపీ హై.. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ.. ఎంత అంటే
రాజకీయ పార్టీలకు కార్పొరేట్ డొనేషన్స్ సహజమే.. అయితే అవీ ఏ స్థాయిలో ఉన్నాయనే అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీ ఫార్మ్స్ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను వెల్లడించింది. 2019-2020లో రాజకీయ పార్టీలు కార్పొరేట్ డొనేషన్ల కింద రూ.920 కోట్లను పొందాయని పేర్కొంది. వీరిలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం ఉన్నాయి. అయితే బీజేపీ కార్పొరేట్ డొనేషన్ ఎక్కువ పొందింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ ఉన్నాయి.

సింహాభాగం బీజేపీకే..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రడెంట్ ఎలక్ట్రొరల్ ట్రస్ట్ ఎక్కువ మొత్తం విరాళం అందజేసింది. ఆ తర్వాత జన్ కల్యాణ్ ఎలక్ట్రొరల్ ట్రస్ట్, ఐటీసీ లిమిటెడ్ ఉన్నాయి. ఎలక్ట్రొరల్ బాండ్లను ఇచ్చాయి. ఇప్పటికీ కూడా బీజేపీ, ఐఎన్‌సీకి సింహాభాగం వాటి ద్వారా వస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు ఎలక్టొరల్ బాండ్లు ఎక్కువ కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ డొనేషన్ల విషయానికి వస్తే ఎన్సీపీ ఎక్కువ కలిగి ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఫ్రడెంట్ ఎలక్టొరల్ ట్రస్ట్ 2020లో రూ.248 కోట్లను అందజేసింది.

అధిక మొత్తం...
గత 8 ఏళ్లలో కార్పొరేట్ డొనేషన్స్ అధికంగా రాజకీయ పార్టీలు కలిగి ఉన్నాయి. రూ.920 కోట్ల విరాళం పొందాయి. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ డొనేషన్స్ 92 శాతం విరాళాలుగా వస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీకి అయినా రూ.20 వేల కన్నా ఎక్కువగా విరాళం అందజేస్తేనే దానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి. అంతకన్నా తక్కువగా ఇస్తే భారత ఎన్నికల సంఘం వద్ద వివరాలు లభించవు.

బీఎస్పీ డేటా నో.. కారణమిదే
కార్పొరేట్ డొనేషన్లలో సింహాభాగం బీజేపీకి వచ్చాయి. ఆ పార్టీ రూ.720 కోట్లను పొందింది. అయితే బీఎస్పీ విరాళాలు మాత్రం లభించలేదు. ఎందుకంటే ఆ పార్టీ రూ.20 వేల కన్నా ఎక్కువ ఏ సంస్థ నుంచి స్వీకరించలేదు. దీనికి సంబంధించి ఈసీకి స్పస్టం చేసింది. సో ఆ డేటా ఎన్నికల సంఘం వద్ద లేదు. అంటే రూ.20 వేల కన్నా తక్కువ మొత్తం తీసుకున్న.. వివరాలు అందుబాటులో ఉండవు. 2019-2020లో విరాళాలకు సంబంధించిన డేటా లేదు.












Click it and Unblock the Notifications