వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ సంచలనం -బ్రహ్మపుత్ర నదిపై యుద్ధం -అస్సాం ఎన్నికల మేనిఫెస్టో -సరైన ఎన్ఆర్‌సీ, 2లక్షల ఉద్యోగాలు

|
Google Oneindia TeluguNews

ఈశాన్య భారతంలోని అతి పెద్ద రాష్ట్రమైన అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీ మరో సంచలన హామీని ప్రకటించింది. ఏటా భారీ వరదలతో వందల మందిని పొట్టనపెట్టుకుంటూ, వేల కోట్లలో ఆస్తి నష్టం కలిగిస్తోన్న 'అస్సాం దు:ఖదాయిని' బ్రహ్మపుత్ర నదిపై దాదాపు యుద్ధభేరి మోగించింది. 'మిషన్ బ్రహ్మపుత్ర'పేరుతో మేనిఫెస్టోలో కొత్త పథకాన్ని ప్రకటించింది. అదే సమయంలో జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్‌సీ)‌, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) సహా మొత్తం 10 కీలకమైన వాగ్ధానాలను ఇచ్చింది.

 న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం విడుదల చేశారు. అస్సామీల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తుందని, జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్‌సీ)‌ సక్రమ నిర్వహణ ద్వారా అసోం నాగరికతను పరిరక్షిస్తుందని, అదే సమయంలో చొరబాటుదారులను ఏరిపారేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.

‘Correct NRC’, CAA, Mission Brahmaputra:Nadda releases BJP’s Assam manifesto 10 promises

ఎన్ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన దరిమిలా, అనుమానాలు నివృత్తి అయ్యేలా ఎన్‌ఆర్‌సీని సరిదిద్ది అసోం ప్రజలకు రక్షణగా నిలుస్తామని, అసోం రాజకీయ హక్కుల పరిరక్షణ కోసం డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి ఏటా అంతులేని విషాదాన్ని నింపే వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు 'మిషన్ బ్రహ్మపుత్ర' పేరుతో బీజేపీ కొత్త పథకాన్ని ప్రకటించింది. అందులో భాగంగా అదనపు జలాలను నిల్వ చేసేందుకు బ్రహ్మపుత్ర నది చుట్టూ పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది.

 షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా షాక్: లోక్‌సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా

అస్సాంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే 2లక్షల మందికి ఉద్యోగాలిస్తామని, తొలి లక్ష ఉద్యోగాలు 2022 మార్చి 31లోపే అందజేస్తామని బజేపీ హామీ ఇచ్చింది. అలాగే, స్వామి వివేకానంద యూత్ ఎంప్లాయిమెంట్ పథకం ద్వారా ఏటా కనీసం 2లక్షల మందికి ఉపాధి అవకావాలను కల్పిస్తామని చెప్పింది. భూమి లేని పేదలకు పట్టా భూముల్ని ఇస్తామని పేర్కొంది. అలాగే,

‘Correct NRC’, CAA, Mission Brahmaputra:Nadda releases BJP’s Assam manifesto 10 promises

రాష్ట్రంలో ఎనిమిదో తరగతి, ఆపై చదువులు చదివే బాలికలు అందరికీ ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని, ఒరునోడుయ్ స్కీమ్ కింద 30 లక్షల మంది అర్హత కలిగిన కుటుంబాలకు నెలకు రూ.3.000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, నామ్ ఘర్ వర్గానికి చెందిన వ్యక్తులకు రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, రాష్ట్ర మంత్రి హిమాంత బిస్వా శర్మ పాల్గొన్నారు. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మూడు విడుతలుగా పోలింగ్ జరుగనుంది. ఈనెల 27న తొలి దశ పోలింగ్ జరుగనుండగా, ఏప్రిల్ 6న చివరి విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. మే 2న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

English summary
BJP president JP Nadda on Tuesday released the party manifesto for the upcoming assembly elections in Assam, just days ahead of the first phase of election in the BJP-ruled state. In the Assam manifesto, BJP has promised a ‘correct NRC’ along with jobs for the youth and cycles for girl students. Announcing the BJP Assam manifesto, JP Nadda said the party is making 10 commitments to help Assam take the next big leap in the coming five years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X