వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌లో బిజెపి: జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌/రాంచీ:జార్ఖండ్‌లో స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడమే తమ లక్ష్యమని బిజెపి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా అన్నారు. ఎన్నికల ఫలితాలు బిజెపి విజయాన్ని సూచించడం హర్షదాయకమని ఆయన అన్నారు. పూర్తి మెజారిటీ రాకపోతే విధాన నిర్ణయాల్లో ఆటంకాలు ఎదురవుతాయని ఆయన అన్నారు.

జార్ఖండ్‌లో బలాబలాలు.. బీజేపీ 43, కాంగ్రెస్ 6, జేఎంఎం 18, జేవీఎం 8, జమ్మూకాశ్మీర్‌ బలాబలాలు... పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, నేషనల్ కాన్ఫరెన్స్ 15 స్థానాలను గెలుచుకుంది.

జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఐదు దశల్లో సుమారు నెలరోజులపాటు జరిగిన పోలింగ్‌లో రికార్డ్‌ స్థాయిలో ఓటర్లు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపునకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని బిజెపి పార్లమెంటరీ బోర్డు రేపు బుధవారం నిర్ణయిస్తుంది. జార్ఖండ్‌లో బిజెపి విజయం సాధించగా, జమ్మూకాశ్మీర్‌లో పిడిపితో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి అనూహ్యమైన ఫలితాలు సాధించింది. కాంగ్రెసు చతికిలపడింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది.

Counting of votes in Jammi & kashmir, Jharkhand

జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఒక చోట ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఎదురు దెబ్బ తగిలింది. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక చోట ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన సోనావర్ నియోజకవర్గంలో పిడిపి అభ్యర్థి అష్రఫ్ చేతిలో ఓటమి పాలయ్యారు. బీర్వాలో ఆయన విజయం సాధించారు.

జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో రెండు చోట్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఎదురు దెబ్బ తగిలింది. పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన సోనావర్ నియోజకవర్గంలో పిడిపి అభ్యర్థి అష్రఫ్ చేతిలో ఓటమి పాలయ్యారు. బీర్వాలో కూడా ఆయన ఓటమి పాలయ్యారు.

జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మధు కొడా పరాజయం పాలు కాగా, ఆయన భార్య గీతా కోడా జగన్నాథపురం నుంచి విజయం సాధించారు. జై భారత్ సమంత పార్టీ తరఫున ఆమె పోటీ చేసారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి మధు కొడా ప్రాతినిధ్యం వహించారు. బర్హైత్ నియోజకవర్గం నుంచి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విజయం సాధించారు.

Counting of votes in Jammi & kashmir, Jharkhand

జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో హంగ్ రాగా, జార్ఖండ్‌లో బిజెపి గాలి వీచింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపి కాంగ్రెసు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో బిజెపి పిడిపితో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడింది.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అనంతనాగ్ నుంచి ప్రతిపక్ష నేత పిడిపి నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ విజయం సాధించారు. కాంగ్రెసు సల్మాన్ సోజ్ బారాముల్లాలో పరాజయం పాలయ్యారు.

జమ్మూకాశ్మీర్‌లోని 87 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 1987 తర్వాత ఈ ఎన్నికల్లోనే అత్యధిక స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైంది. రాష్ట్రంలో పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ), బీజేపీ, కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నడుమ చతుర్ముఖ పోరు నెలకొంది. ప్రస్తుత సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా సోనావర్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉండగా, పీడీపీ సీఎం అభ్యర్థి ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ బీర్వా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. వేర్పాటువాద ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సజ్జద్‌ ఘనీ లోన్‌ పోటీ చేసిన హంద్వారా నియోజకవర్గంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Counting of votes in Jammi & kashmir, Jharkhand

జార్ఖండ్‌లోని 81 స్థానాలకు పోలింగ్‌ జరగ్గా రికార్డ్‌ స్థాయిలో 66 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జెఎంఎం), బీజేపీ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ దమ్కా బర్‌హైత్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం అర్జున్‌ ముండా ఖర్‌స్వాన్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. బాబూలాల్‌ మరాండి ధన్వార్‌, గిర్ధి నియోజకవర్గాల నుంచి, మధుకోడా మజ్‌గావ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ప్రస్తుతం పార్టీల బలాబలాలు

జమ్మూ కాశ్మీర్‌(87): 2008 ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 28, పీడీపీకి 21, బీజేపీకి 11, కాంగ్రెస్‌కి 17 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన 10 స్థానాలను ఇతర పార్టీలు దక్కించుకున్నాయి.

జార్ఖండ్‌(81): 2009 ఎన్నికల్లో బీజేపీ 18, జేఎంఎం 18, కాంగ్రెస్‌ 14, జేవీఎం 11 స్థానాల్లో గెలుపొందగా మరో 20 స్థానాల్లో ఇతర పార్టీలు పాగా వేశాయి.

Counting of votes in Jammi & kashmir, Jharkhand
English summary
counting of votes began in Jammu & Kashmir and Jharkhand in assembly elections held in 5 phases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X