సెల్యూట్ ఆఫీసర్స్.. డియోఘర్ రెస్య్కూ ఆపరేషన్‌పై మోడీ.. సిబ్బందితో ఇంటరాక్షన్

డియోఘర్ రెస్య్కూ ఆపరేషన్ చేసిన అధికారులు/ సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. వారు ఆపరేషన్‌ను యావత్ జాతి అభినందిస్తోందని తెలిపారు. డియోఘర్ ప్రమాద ఘటన నుంచి ప్రజలను కాపాడిన అధికారులతో మోడీ ఇంటరాక్ట్ అయ్యారు. జనాలను కాపాడేందుకు సిబ్బంది శ్రమించారని తెలిపారు.

ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, పోలీసులు కలిసి ఏ విపత్తులో అయినా ఎదుర్కొంటున్నాయని.. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నాయని తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రెస్య్కూ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ అభినందించారు. ఇలా ఏ విపత్తును అయినా సమిష్టిగా ఎదుర్కొంటామని చెప్పారు.

Country is proud of you: PM Modi lauds officers who led Deoghar rescue operation

జార్ఖండ్‌ డియోఘర్ జిల్లాలోని త్రికుట్‌హిల్స్‌ను కలిపే కేబుల్ కార్లలో ప్రమాదం జరిగింది. గాలిలో ఉండిపోయిన పర్యాటకులను సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదం నుంచి 50 మంది బయటపడ్డారు. ఆదివారం రోప్‌వే సరిగ్గా పనిచేయకపోవడంతో గాలిలో కేబుల్ కార్లు నిలిచిపోయాయి.

మంగళవారం తెల్లవారుజాము నుంచే బాధితులను రక్షించే పనిలో పడినట్టు ఆయన తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ఆపరేషన్‌ను సాయంత్రం పూట నిలిపివేశామని, దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల తప్పలేదని మంజునాథ్ వెల్లడించారు. అయితే అధికారులు వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లు అందజేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+