వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యావత్ దేశం మీ వెంటే ఉంది.. షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ లకు రాహుల్ గాంధీ లేఖ

|
Google Oneindia TeluguNews

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో మాదకద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో ఆర్యన్ ఖాన్ తండ్రి షారుఖ్ ఖాన్ కు అనేక మంది సినీ ప్రముఖుల నుండి మరియు మహారాష్ట్ర అధికార శివసేన పార్టీ నుండి మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నుండి మద్దతు లభించింది. కావాలని బీజేపీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కు వెనకుండి ఇదంతా నడిపిస్తుందన్న ఆందోళన వ్యక్తం అయ్యింది. పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇదంతా కావాలని చేస్తున్న కుట్రగా అభివర్ణించారు.

ఆర్యన్ ఖాన్ కేసులో షాకింగ్ ట్విస్ట్: లంచం డీల్ జరిగింది; సమీర్ వాంఖడే పాత్రపై సామ్ డిసౌజా సంచలనం

యావత్ దేశం మీ వెంటే ఉందని రాహుల్ గాంధీ లేఖ

యావత్ దేశం మీ వెంటే ఉందని రాహుల్ గాంధీ లేఖ

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు కొనసాగుతున్న సమయంలో బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు వెల్లువగా మారాయి. ఇదే సమయంలో రాహుల్ గాంధీ కూడా షారూఖ్ ఖాన్‌కు అప్పుడు లేఖ రాశారు. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ఖాన్ జైలుకెళ్లిన ఆరు రోజుల తర్వాత, అక్టోబర్ 14న రాహుల్ గాంధీ సూపర్ స్టార్‌ షారూక్ ఖాన్ కు లేఖ రాశారు. అప్పటికే, 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ కు కోర్టు బెయిల్ నిరాకరించింది. లేఖలో, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షారుక్ ఖాన్‌తో "యావత్ దేశం మీ వెంట ఉంది" అని పేర్కొన్నట్టు సమాచారం.

రాహుల్ రాసిన లేఖలో చెప్పింది ఇదే

రాహుల్ రాసిన లేఖలో చెప్పింది ఇదే

రాహుల్ గాంధీ తాను రాసిన లేఖలో "ప్రజల కోసం మీరు చేసిన మంచి పనిని చూశాను. వారి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మీకు తప్పకుండా ఉంటాయని నమ్ముతున్నాను" అని పేర్కొన్నారు. ఇలా ఏ పిల్లలకు జరగకూడదని ఆయన పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బాంబే హైకోర్టు అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పత్రాలు జైలుకు అందిన తర్వాత గత శనివారం ఆర్యన్ ఖాన్ విడుదల అయ్యారు.

ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ టార్గెట్ చేసిందన్న విమర్శలు

ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ టార్గెట్ చేసిందన్న విమర్శలు


నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్ పార్టీలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ ను టార్గెట్ చేశారన్న అభిప్రాయం అందరిలో వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ దాదాపు ఒక నెల జైలులో గడిపాడు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారూక్ ఖాన్ పెద్ద పోరాటమే చెయ్యాల్సి వచ్చింది. అతని వద్ద ఎటువంటి డ్రగ్స్ కనుగొనబడనప్పటికీ, అతని వాట్సాప్ చాట్‌లు "అక్రమ మాదకద్రవ్యాల ఒప్పందాలు" మరియు విదేశీ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు రుజువు చేశాయని డ్రగ్స్ వ్యతిరేక ఏజెన్సీ కోర్టులో పేర్కొంది.

షారూక్ ఖాన్ కు రాహుల్ రాసిన లేఖ .. ఆలస్యంగా వెలుగులోకి

షారూక్ ఖాన్ కు రాహుల్ రాసిన లేఖ .. ఆలస్యంగా వెలుగులోకి

ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేశాడని నిర్ధారించడానికి వాట్సాప్ చాట్‌లు సరిపోవని హైకోర్టు పేర్కొంది. ఆర్యన్ ఖాన్ జైల్లో ఉన్న సమయంలో షారూక్ కుటుంబానికి బాలీవుడ్ వర్గాలు, అభిమానులు మద్దతు తెలిపారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఏకంగా నార్కోటిక్స్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ను టార్గెట్ చేశారు. ఇక ఈ సమయంలో షారూక్ ఖాన్ కు రాహుల్ గాంధీ కూడా లేఖ రాసినట్టు సమాచారం. ఆ లేఖ ద్వారా షారుక్ ఖాన్ కు రాహుల్ గాంధీ తమ మద్దతు ప్రకటించారు. కానీ ఈ కేసుపై షారుక్ ఖాన్ ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం గమనార్హం .

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై దేశం మొత్తం ఆసక్తి

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై దేశం మొత్తం ఆసక్తి

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైన తర్వాత, షారూఖ్ ఖాన్ కళ్ళలో ఆనందభాష్పాలు కనిపించాయని వార్తలు వచ్చాయి. అంతకు ముందు ఆర్యన్ ఖాన్ బెయిల్ ఎన్డీపీఎస్ కోర్టులో రెండు సార్లు తిరస్కరణకు గురి కావటంతో షారూక్ ఖాన్ ఆందోళనకు గురయ్యారు. కొడుకు బెయిల్ కోసం తీవ్రంగా ఆందోళన చెందారు. ఆర్యన్ ఖాన్ జైల్లో ఉన్న సమయంలో తల్లి గౌరీ ఖాన్ కూడా ఏడుస్తూ గడిపారని వార్తలు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ దొరకకున్నా ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ను మొదటి నిందితుడిగా పేర్కొన్న ఎన్సీబీ ఆర్యన్ బయటకు రాకుండా బలంగా వాదించటం ఈ కేసుపై అందరి దృష్టి మళ్లేలా చేసింది.

English summary
Rahul Gandhi wrote letter to shah rukh khan and gauri khan, saying he was ‘sorry’ that they had to go through all the difficulties. He added in the letter: “No child deserves to be treated like this.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X