పెళ్లికి నిరాకరించారని రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హల్‌దార్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో విషాధ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదని.. ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హల్‌దార్‌పూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కారుట్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు.

అంతేగాక, యువతికి ఆమె తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం చేయడానికి నిశ్చయించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు రత్నపూర్ రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
డ్రైవర్ వేధింపులతో వాహనంలోంచి దూకేసిన మహిళ మృతి
డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో కదులుతున్న వాహనంలోంచి దూకిన ముగ్గురు మహిళల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన మే 14వ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బాఘ్రా గ్రామంలో జరిగింది.
డైవర్ వేధింపులతో వాహనం నుంచి దూకి తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్న వారిలో ప్రవీణ అనే మహిళ మంగళవారం మరణించింది. మరో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications