రేప్! రైల్లోనుంచి దూకింది, బట్టలు చించి లవర్స్‌పై దాడి

కోల్‌కతా/రూర్కేలా: రైలులో వెళ్తున్న ఓ మహిళను యువకులు వేధించారు. అత్యాచారం నుంచి తప్పించుకునేందుకు సదరు మహిళ, అతని భర్త, పిల్లలు వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది.

అలీపూర్‌ద్వార్ జిల్లాలోని బుక్సా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో గల రాజా భట్కావా రైల్వే స్టేషన్‌కు సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

భర్త, కుమారుడితో కలిసి మహిళ రైలులో ప్రయాణిస్తోంది. అయితే, అందులోనే ప్రయణీస్తున్న దండుగులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. వారిని ఎదిరించే పరిస్థితి లేక, తమను తాము కాపాడుకునేందుకు రైల్లో నుంచి దూకేసింది. గాయాలతో ట్రాక్ పక్కన పడి ఉన్న వారిని స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

Couple jumps off train after wife molested

మోరల్ పోలిసింగ్ పేరుతో దాష్టీకం

ఉత్తరాఖండ్ రూర్కేలలో మోరల్ పోలిసింగ్ పేరుతో ప్రేమజంటను దారుణంగా చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. ప్రేమికులైన యువకుడు, యువతి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నారు. ఈ సమయంలో మోరల్ పోలిసింగ్ పేరుతో గ్రామస్థులు వారిపై దాడికి పాల్పడ్డారు.

యువతిని కూడా విచక్షణారహితంగా కొట్టారు. ప్రేమికులిద్దరి దుస్తులు చించేశారు. తమను వదిలేయాలని ఎంతగా బతిమాలినా వారు వినలేదు. అయితే, కాసేపటికి పెద్ద మనుషులు కొందరు సర్ది చెప్పి పంపించడంతో వారు బతికిపోయారు.

మాంసం దొంగిలించిందని మహిళ తల నరికేశారు

మాంసం దొంగిలించిందని ఓ ఆదివాసి మహిళ తల నరికేసిన ఘటన గౌహతిలో చోటుచేసుకుంది. సోనిత్‌పూర్‌ జిల్లాలోని బార్‌ఘులి ప్రాంతానికి చెందిన ఫాగుని కవారి(50) కుటుంబానికి, అదే ప్రాంతానికి చెందిన మరో కుటుంబానికి మధ్య కోళ్ల దొంగతనం అంశంపై కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఫాగుని కుటుంబం తమ కోళ్లను దొంగిలించి విందుచేసుకుంటోందని నిందితుల కుటుంబం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులు ఓ పదునైన ఆయుధంతో ఫాగుని తల నరికి, ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచారు. ఫాగుని కుటుంబసభ్యులు తమని తాము రక్షించుకోవడానికి అక్కడినుంచి పారిపోయారు. పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+